Porsche India Records Sales In India 2023: భారతీయ మార్కెట్లో మహా అయితే టాటా కార్లో లేదా మహీంద్రా కార్లు మాత్రమే కొనుగోలు చేస్తారు, అన్యదేశ్య కార్లు ఎక్కువ ఖరీదు ఉండటం వల్ల కొనుగోలు చేయరు అనుకుంటే పొరపాటే. మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి జర్మన్ లగ్జరీ కార్లు లంబోర్ఘిని వంటి ఇటాలియన్ కార్లు, వోల్వో వంటి స్వీడన్ బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
జర్మనీ కంపెనీ అయిన ‘పోర్స్చే’ (#Porsche) కార్ల అమ్మకాల్లో భారతదేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్క 2023వ సంవత్సరంలో మాత్రమే పోర్స్చే కంపెనీ దేశీయ విఫణిలో ఏకంగా 914 కార్లను విక్రయించి ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ అమ్మకాలు 2022లో 779 యూనిట్లు మాత్రమే, అంతకు ముందు ఏడాది.. అంటే 2021లో అమ్మకాలు 64 శాతం తక్కువ.
2022 అమ్మకాల కంటే 2021లో పోర్స్చే అమ్మకాలు 64 శాతం తగ్గాయి. 2023లో కూడా ఎక్కువగా అమ్ముడైన పోర్స్చే మోడల్ కారు టైకాన్ కావడం గమనార్హం. ఇది 113 యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఆ తరువాత 911 స్పోర్ట్స్ కూపే (65 యూనిట్ల అమ్మకాలు) మంచి అమ్మకాలు పొందింది.
2023 కంటే 2022లో పోర్స్చే అమ్మకాలు 17 శాతం తక్కువ. కంపెనీ ఇప్పటి వరకు భారతదేశంలో ఇన్ని కార్లను ఎప్పుడూ విక్రయించకపోవడం గమనార్హం. గత ఏడాది ఒక్క టైకాన్ మాత్రమే, పోర్స్చే కయెన్ మరియు మకాన్ కూడా మంచి అమ్మకాలను పొందాయి. మొత్తం మీద పోర్స్చే ఇండియాకు 2023 కలిసొచ్చిన సంవత్సరం అనే చెప్పాలి.
గత ఏడాది కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందిందని, ప్రతి మోడల్ కూడా మంచి సంఖ్యలో అమ్ముడైనట్లు పోర్షే ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ‘మనోలిటో వుజిసిక్’ అన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది (2024) కూడా కంపెనీ ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని, ఇది మా రిటైల్ నెట్‌వర్క్‌కు విస్తరించడంతో పాటు అనేక కొత్త ఉత్పత్తులను ప్రారంభించడానికి మమ్మల్ని పోత్సహిస్తోందని అన్నారు.
2024లో ప్రథమార్థంలో పోర్షే ఇండియా పూణె మరియు హైదరాబాద్‌లలో రెండు కొత్త షోరూమ్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎనిమిది డీలర్‌షిప్‌లు ఉన్నాయి. ఈ సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.
పోర్స్చే మకాన్ ఈవీ (Porsche Macan EV)
కంపెనీ 2024 ప్రారంభంలోనే భారతీయ విఫణిలో రూ. 1.65 కోట్ల (ఎక్స్ షోరూమ్) కారును లాంచ్ చేసింది. డెలివరీలు 2024 రెండవ భాగంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మకాన్ టర్బో, మకాన్ 4 అనే రెండు ట్రిమ్లలో లభించే ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుందు.
పోర్స్చే మకాన్ ఈవీ టర్బో ట్రిమ్‌లో 100 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 591 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక మకాన్ ఈవీ 4ట్రిమ్‌లో ఉన్న బ్యాటరీ 613 కిమీ రేంజ్ అందిస్తుంది. మాకాన్ మోడల్‌లు ప్రతి యాక్సిల్‌పై సింగిల్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో డ్యూయల్ పర్మనెంట్ సింక్రోనస్ మోటార్‌లను కలిగి ఉంటాయి.
Don’t Miss: ఒక్క చూపుతోనే ఫిదా చేస్తున్న బాలీవుడ్ సింగర్ కొత్త కారు – ఫోటోలు వైరల్
మకాన్ ఈవీ టర్బో ట్రిమ్‌లోని మోటార్ 639 హార్స్ పవర్ మరియు 1130 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 260 కిమీ కావడం గమనార్హం. ఇక మకాన్ 4 ట్రిమ్ కేవలం 5.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
నిజానికి పోర్స్చే కార్లు అన్యదేశ్య వాహనాలైనప్పటికీ భారతదేశంలో మంచి ప్రజాదరణ పొందాయి. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు మరియు క్రికెటర్లు ఎక్కువగా ఈ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పటి రోజులతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో పోర్స్చే కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.