మనసులో మాట చెప్పిన పుష్ప 2 నటుడు: సమయం దొరికితే..

Pushpa 2 Actor Fahadh Faasil Car Collection: మలయాళం సినిమాల్లో మాత్రమే కాకుండా.. పుష్ప సినిమాతో బాగా పాపులర్ అయిన నటుడు ‘ఫహద్ ఫాసిల్’ అందరికీ సుపరిచయమే. ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాలో కూడా నటించారు. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. కార్ డ్రైవింగ్ చేయడం చాలా ఇష్టమని ఓ ఇంటర్వూలో స్వయంగా పేర్కొన్నారు.

చిన్నప్పటి నుంచే ఇతనికి కార్లంటే చాలా ఇష్టమని, ఆ ఇష్టం తన తండ్రి వల్ల కలిగిందని పేర్కొన్నాడు. మమ్ముట్టి నడుపుతున్న టాటా ఎస్టేట్ మరియు ఫోర్డ్ ఎస్కార్ట్ వంటివి తన తండ్రికి చెందినవని కూడా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను పెరుగుతున్న కొద్దీ కార్ల మీద ప్రేమ కూడా మరింత ఎక్కువైందని ఫాసిల్ వివరించారు. అంతే కాకుండా చిత్ర పరిశ్రమలో ఎదగటానికి ముందు మారుతి ఎస్ఎక్స్4 (Maruti SX4) ఉపయోగించేవాడినని పేర్కొన్నారు.

సమయం దొరికినప్పుడల్లా..

చప్పా కురిషు సినిమా షూటింగ్ సమయంలో నటుడు వినీత్ శ్రీనివాసన్‌తో కలిసి రోడ్ ట్రిప్‌లకు వెళ్లడం గురించి కూడా ఫాసిల్ వెల్లడించారు. ఒకప్పటి నుంచే డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని, ఈ కారణంగానే ఎప్పుడుపడితే అప్పుడు.. సమయం దొరికినప్పుడల్లా.. స్నేహితులతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్ళేవాడినని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు లాంచ్ జర్నీ చేయాలంటే ముందుగానే ఓ ప్లాన్ వేసుకోవాలని ఆయన అన్నారు.

ఇప్పుడు నేను నా భార్య నజ్రియా (Nazriya)తో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే.. తనకు కూడా లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. ఇద్దరికీ డ్రైవింగ్ పట్ల ఇష్టం ఉండటం వల్ల వీలు దొరికినప్పుడు లాంగ్ డ్రైవ్ వెల్తూ ఉంటామని ఫాసిల్ చెప్పారు. కొన్నిసార్లు అనుకోకుండా లాంగ్ డ్రైవ్ వెళ్లడం మాకు మంచి థ్రిల్ ఇస్తుందని అన్నారు.

లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టపడే ఫాహిద్ ఫాసిల్.. ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఈయన గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90, లంబోర్ఘిని ఉరుస్, పోర్స్చే 911 కారేరా, మినీ కూపర్ కంట్రీమ్యాన్ మొదలైన కార్లు ఉన్నాయి.

ఫాహిద్ ఫాసిల్ కార్ కలెక్షన్ (Fahadh Faasil Car Collection)

నటుడు ఫాహిద్ ఫాసిల్ ఉపయోగించే కార్లలో ఒకటి మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ (Mercedes Benz G63 AMG) ఒకటి. దీని ధర రూ. 4.6 కోట్లు. ఈ కారును ఇటీవలే తన భార్య నజ్రియాతో కలిసి డీలర్‌షిప్ నుంచి డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీనికి 6003 అనే ఒక వీఐపీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వేయించారు.

అంబానీ వంటి ప్రముఖులు ఇప్పటికే ఈ తరహా కార్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ కారు కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలోకి ఫాసిల్ కూడా చేరారు. ఈ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 585 Bhp పవర్, 850 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ కలిగి.. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టం పొందుతుంది. కాబట్టి ఇది బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది.

Also Read: కోడళ్ల కంటే ముందే అక్కినేని ఇంట చేరిన కొత్త అతిథి – ఇవిగో ఫోటోలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేయడానికి ముందు.. ఫాహిద్ ఫాసిల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 (Land Rover Difender 90) ఉపయోగించేవారు. దీని ధర రూ. 1.04 కోట్లు (ఎక్స్ షోరూమ్). 5.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 518 Bhp పవర్ 625 Nm టార్క్ అందిస్తుంది. సుమారు 2.5 టన్నుల బరువున్న ఈ కారు కేవలం 5.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 టాప్ స్పీడ్ 240 కిమీ.

ఫాహిద్ ఫాసిల్ గ్యారేజిలోని మరో కారు లంబోర్ఘిని కంపెనీకి చెందిన ఉరుస్ (Lamborghini Urus). దీని ధర రూ. 4 కోట్ల కంటే ఎక్కువ. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ద్వారా 650 పీఎస్ పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇప్పటికే ఈ బ్రాండ్ కార్లు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి సెలబ్రిటీల గ్యారేజిలో కూడా ఉన్నాయి.

నటుడు ఫాసిల్ గ్యారేజిలోని మరో కారు పోర్స్చే 911 కారేరా ఎస్ (Porsche Carrera S). దీని ధర రూ. 2 కోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇది 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన 3.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ సిక్స్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 448 పీఎస్ పవర్ మరియు 530 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఈ కారు చాలా అద్భుతంగా ఉంటుంది.

Leave a Comment