Rashmika Mandanna Car Collection: ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ పుష్ప 2 (Pushpa 2). రేపు తెరమీదకి రానున్న ఈ సినిమా కోసం అటు అల్లు అర్జున ఫ్యాన్స్, ఇటువైపు రష్మిక మందన్న అభిమానులు మాత్రమే కాకుండా ఐటమ్ సాంగుతో అదరగొట్టిన శ్రీలీల ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో నటి.. నేషనల్ క్రష్ రష్మిక గురించి.. ఆమె ఉపయోగించే కార్లను గురించి వివరంగా ఇక్కడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఛలో సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన రష్మిక మందన్న.. గీత గోవిందం సినిమాతో బాగా పాపులర్ అయింది. ఆ తరువాత భీష్మ, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాల్లో నటిస్తూ లెక్కకు మించిన అభిమానులను సొంతం చేసుకుంది. పుష్ప సినిమాతో మరింత ఫేమస్ అయిన తరువాత.. ఇప్పుడు తాజాగా పుష్ప 2 సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా రేపు (డిసెంబర్ 4) వివిధ భాషల్లో రిలీజ్ అవుతుంది.
సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. రష్మిక మందున్నకు ఖరీదైన కార్లను ఉపయోగించడం పట్ల కూడా ఎక్కువ అభిరుచి ఉంది. ఈ కారణంగానే.. ఈమె ఎప్పటికప్పుడు తనకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం రష్మిక గ్యారేజిలో రేంజ్ రోవర్ స్పోర్ట్స్, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్, టయోట ఇన్నోవా మరియు హ్యుందాయ్ క్రెటా వంటి కార్లను కలిగి ఉంది.
రష్మిక మందన్న కార్ కలెక్షన్ (Rashmika Mandanna Car Collection)
నటి రష్మిక ఉపయోగించే కార్లలో ఖరీదైన కారు.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ (Range Rover Sport). దీని ధర రూ. 1.40 కోట్లు. ఈ కారును రష్మిక 2021లో కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నలుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ కారు లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఈ కారు చాలా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఈ కారు ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ కారును ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
రష్మిక మందన్న ఉపయోగించే కార్ల జాబితాలో మరో ఖరీదైన కారు ఆడి క్యూ3 (Audi Q3). దీని ధర దాదాపు రూ. 50 లక్షల వరకు ఉంటుంది. రష్మిక ఆడి కారు ఎరుపు రంగులో ఉంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు.. సరికొత్త డిజైన్ పొందుతుంది. 1984 సీసీ ఇంజిన్ కలిగిన ఈ కారు 187.74 Bhp పవర్ మరియు 320 Nm టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు యొక్క సీటింగ్ కెపాసిటీ 5. ఇది రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.
Also Read: మనసులో మాట చెప్పిన పుష్ప 2 నటుడు: సమయం దొరికితే..
మెర్సిడెస్ బెంజ్ చెందిన సీ క్లాస్ (Mercedes Benz C Class) కూడా రష్మిక గ్యారేజిలో ఉంది. మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ. 70 లక్షలు. చాలామంది సెలబ్రిటీల మాదిరిగానే రష్మిక కూడా బెంజ్ కారును ఉపయోగిస్తోంది. నిజానికి సినీ ఇండస్ట్రీలో చాలామంది తారలు బెంజ్ కార్లను ఉపయోగించడానికి ఇష్టపడతారు. ఇందులో రష్మిక మందన్న కూడా ఒకరు.
టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) మరియు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) కార్లు కూడా రష్మిక మందన్న గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా ధర రూ. 20 లక్షలు కాగా.. క్రెటా ధర రూ. 11 లక్షలు. ఇవి రెండూ కూడా భారతీయ మార్కట్లో ఎక్కువమంది కొనుగోలు చేసిన కార్లు. రష్మిక మందన్న తొలి రోజుల్లో ఈ కార్లను ఉపయోగించేది సమాచారం.
రష్మిక నెట్‍వర్త్ మరియు రెమ్యునరేషన్ (Rashmika Mandanna Networth & Remuneration)
నటి రష్మిక మందన్న మొత్తం నెట్‍వర్త్ సుమారు రూ. 70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈమె ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అయితే పుష్ప 2 సినిమాకు ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈమె ఖరీదైన బంగ్లా వంటివి కూడా కలిగి ఉన్నట్లు సమాచారం.