Pushpa 2 Choreographer Shrasti Verma New Car: శ్రష్టి వర్మ.. ఈ పేరు ఒకప్పుడు చాలామందికి తెలియదు. పుష్ప 2 సినిమా భారీ విజయం సాధించిన తరువాత ఈమె పేరు కూడా బాగా పాపులర్ అయింది. కొరియోగ్రఫీతో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా ఓ కొత్త కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఈమె కొన్న కారు ఏది?, దాని ధర ఎంత అనే వివరాల కోసం తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. కొనుగోలు చేసిన కొత్త కారు హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ20 (Hyundai i20) అని తెలుస్తోంది. కారు కొనుగోలు చేసిన తరువాత.. కున్ హ్యుందాయ్ హైదరాబద్ డీలర్షిప్ నుంచి డెలివరీ పొందింది. కారును కొనుగోలు చేసిన సందర్భంగా.. డీలర్షిప్ యాజమాన్యం.. ఆమె శుభాకాంక్షలు చెబుతూ.. హ్యుందాయ్ ఫ్యామిలీలోకి ఆహ్వానించారు.
శ్రష్టి వర్మ కొత్త కారును కొనుగోలు చేయడంతో.. పలువురు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈమె ఢీ షోతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగులో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. అలా సక్సెస్ సాధిస్తూ ఎదిగిన ఈమె ఇప్పుడు సరికొత్త కారును కొనుగోలు చేసింది. బహుశా ఇదే ఆమె మొదటికారు అయి ఉండొచ్చని తెలుస్తోంది.
హ్యుందాయ్ ఐ20
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువమంది కొనుగోలు చేసిన హ్యుందాయ్ బ్రాండ్ కార్లలో ఐ20 ఒకటి. ఈ కారు ధరలు రూ. 8.53 లక్షల నుంచి రూ. 13.92 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో మార్కెట్లో అమ్మకానికి ఉంది. అయితే శ్రష్టి వర్మ ఏ వేరియంట్ కొనుగోలు చేసిందనే విషయం స్పష్టంగా తెలియదు.
చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు.. సింగిల్ టోన్ కలర్ మరియు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులోని పెట్రోల్ ఇంజిన్ 6000 rpm వద్ద 87 Bhp పవర్, 4200 rpm వద్ద 114.7 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు ఎల్ఈడీ లైటింగ్ సెటప్ కలిగి.. సైడ్ మరియు రియర్ ఎండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
Also Read: ఖరీదైన కారులో తమన్నా: ఓదెల 2 రిలీజ్‌కు ముందే అక్కడ కనిపించిన మిల్కీ బ్యూటీ
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఐ20 కారులో హ్యుందాయ్ అత్యాధునిక ఫీచర్స్ అందించింది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, మంచి సీటింగ్ పొజిషన్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
హ్యుందాయ్ ఐ20 కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఏబీఎస్ విత్ ఈబీడీఎమర్జెన్సీ స్టాప్ సిగ్నెల్స్, హెడ్ ప్రొటెక్టింగ్ సైడ్ కర్టెన్స్ మరియు చైల్డ్ సీట్ మౌంట్స్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.