Rakesh Roshan Buys New Mercedes Maybach S580: భారతదేశంలో విక్రయానికి అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) కంపెనీకి చెందిన ‘మేబ్యాక్’ (Maybach) ఒకటి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ కారు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ కారును ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ ‘రాకేష్ రోషన్’ కొనుగోలు చేశారు.
రాకేష్ రోషన్ కొనుగోలు చేసిన కారు ”వైట్ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్580”. ఈ సెడాన్ డెలివరీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో మెర్సిడెస్ బెంజ్ డీలర్.. రాకేష్ రోషన్‌కు గిఫ్ట్ అందించి, కారును డెలివరీ చేయడం చూడవచ్చు. ఈ ఫోటోలలో వైట్ కలర్ బెంజ్ కారును చూడవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్
దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్.. రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎస్580 మరియు ఎస్680. వీటి ధరలు వరుసగా రూ. 2.71 కోట్లు మరియు రూ. 3.43 కోట్లు (ఎక్స్ షోరూమ్). అయితే రాకేష్ రోషన్ కొనుగోలు చేసిన కారు ‘మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్580’ అని తెలుస్తోంది.
మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ సెడాన్ మంచి డిజైన్ కలిగి, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇది నాటికే బ్లూ, ఓనికి బ్లాక్, ఎమరాల్డ్స్ గ్రీన్ మరియు వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉన్నాయి. ముందు భాగంలో బ్రాండ్ లోగో ఉంటుంది. సైడ్ అండ్ రియర్ ప్రొఫైల్ అంతా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. 12.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి వాటితో పాటు.. జీపీఎస్ న్యావిగేషన్, వాయిస్ కమాండ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు వైర్‌లెస్ ఛార్జర్ మొదలైనవి ఇందులో ఉంటాయి. ఇందులోని సీట్లు 19 మరియు 44 డిగ్రీల వరకు వంగుతాయి. లెగ్ రెస్ట్ కూడా ఇందులో లభిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా.. హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, సీట్ వెంటిలేషన్, వెనుక ప్రయాణికుల కోసం కాఫ్ మసాజర్ కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.
బెంజ్ మేబ్యాక్ ఎస్580 మరియు ఎస్680 యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇవి రెండూ చాలా వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. ఎస్580 ఈక్యూ బూస్ట్‌తో కూడిన 4.0 లీటర్ వీ8 ట్విన్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది. ఇది 496 Bhp పవర్ మరియు 700 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం మరియు 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.
ఇక ఎస్680 విషయానికి వస్తే.. ఇది 6.0 లీటర్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 604 Bhp పవర్ మరియు 900 Nm మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం మరియు 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.
హృతిక్ రోషన్ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్
ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా గతంలో మేబ్యాక్ ఎస్600 కొనుగోలు చేశారు. ఇది కూడా అదే వైట్ కలర్ పొందింది. ఈ సెడాన్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 6.0 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 523 Bhp పవర్ మరియు 830 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
Don’t Miss: కల్కి 2898 ఏడీ: ‘బుజ్జి’ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు
రాకేష్ రోషన్
1970 నుంచి సుమారు 84 చిత్రాలలో ఈయన కనిపించారు. ఈయన దర్శకత్వంలో చాలా చిత్రాలు ‘కే’ ప్రారంభమై గొప్ప హిట్స్ కొట్టాయి. ఇందులో ఖుద్గర్జ్, కహో నా, క్రిష్, కోయి మిల్ గయా భారీ హిట్ సాధించాయి. కహోనా సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అనేక అవార్డులను పొందారు. మొత్తం మీద బాలీవుడ్ చిత్ర సీమలో రాకేష్ రోషన్ ఒక మెరుపు మెరిశారు.