Range Rover Evoque Facelift Launched In India: ఇండియన్ మార్కెట్లో మరో కొత్త ల్యాండ్ రోవర్ లాంచ్ అయింది. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ల్యాండ్ రోవర్ కారు ధర, డిజైన్, బుకింగ్స్ వంటి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.
ల్యాండ్ రోవర్ కంపెనీ భారతీయ మార్కెట్లో లాంచ్ చేసిన ఈ కొత్త కారు రేంజ్ రోవర్ ఎవోక్ (Range Rover Evoque Facelift) ధర రూ. 67.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ లేటెస్ట్ కారు డైనమిక్ ఎస్ఈ అనే ఒక ట్రిమ్‌లో లభిస్తుంది. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
రేంజ్ రోవర్ ఎవోక్ ఎక్స్టీరియర్ డిజైన్
మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఇందులో రీడిజైన్ చేయబడిన గ్రిల్, ఎల్ఈడీ రన్నింగ్ ల్యాంప్ సిగ్నేచర్‌లతో కూడిన కొత్త సూపర్ స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త రెడ్ బ్రేక్ కాలిపర్‌లు మరియు అల్లాయ్ వీల్స్ కోసం కొత్త ట్విన్ 10 స్పోక్ డిజైన్ ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్
- కొరింథియన్ బ్రాంజ్
- ట్రిబెకా బ్లూ
రేంజ్ రోవర్ ఎవోక్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఫీచర్స్
కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో 11.4 ఇంచెస్ కర్వ్‌డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ కూడా చాలా వరకు అప్డేట్ చేయబడినట్లు గమనించవచ్చు. రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్‌లో కొత్త గేర్ లివర్ కూడా చూడవచ్చు.
ఇందులో హీటెడ్ అండ్ కూల్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు మరియు కొత్త ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
రేంజ్ రోవర్ ఎవోక్ ఇంజన్
కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 247 హార్స్ పవర్ మరియు 365 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. డీజిల్ ఇంజిన్ 201 హార్స్ పవర్ మరియు 430 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
ఇందులోని రెండు ఇంజన్లు 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను బెల్ట్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్‌తో పొందుతాయి. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇందులో ఎకో, కంఫర్ట్, గ్రాస్ గ్రావెల్ స్నో, మడ్ రట్స్, సాండ్, డైనమిక్ మరియు ఆటోమేటిక్ అనే ఏడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.
ప్రత్యర్థులు
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఆడి క్యూ5 , మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 మరియు వోల్వో ఎక్స్‌సి60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. కావున ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది.
Don’t Miss: BMW Z4 M40i: కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న యమదొంగ నటి – ఫోటోలు వైరల్
భారతీయ మార్కెట్లో రేంజ్ రోవర్ కార్లకు ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉండనే విషయం దాదాపు అందరికి తెలుసు. అయితే కంపెనీ కూడా దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. కొత్త కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతోంది. కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ల్యాండ్ రోవర్ మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.