రతన్ టాటా అరుదైన వీడియో: ఫిదా అయిపోతున్న జనం

Rare Video Of Ratan Tata And His Car Collection: అందరూ పుడతారు, చనిపోతారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో యుగపురుషులుగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు.. భరతమాత ముద్దుబిడ్డ ‘రతన్ టాటా’ (Ratan Tata). పారిశ్రామిక రంగంలో అంచెలంచెలుగా ఎదిగి దేశం కోసం లెక్కకు మించి దానం చేసిన ఈ దానశీలి 2024 అక్టోబర్ 09న కన్ను మూసారు. ఈయన మరణం ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలను కంటతడి పెట్టేలా చేశాయి. అయితే ఇప్పుడు రతన్ టాటా మెర్సిడెస్ బెంజ్ కారును డ్రైవ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్ అవుతోంది.

దివంగత దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 స్పోర్ట్స్ కారును స్వయంగా డ్రైవ్ చేశారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రతన్ టాటా కారును డ్రైవ్ చేస్తుంటే.. మరో కారులో ప్రయాణించే ఎవరో వీడియో రికార్డ్ చేసినట్లు స్పష్టమవుతోంది. రతన్ టాటా డ్రైవ్ చేస్తున్న కారు సిల్వర్ కలర్ స్పోర్ట్స్ కారు. ఈయన కారును డ్రైవ్ చేస్తుంటే.. పక్కన ఎవరో సిబ్బంది కూడా ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 (Mercedes Benz SL500)

నిజానికి వీడియోలో కనిపిస్తన్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 కారును రతన్ టాటా కోసం ప్రత్యేకంగా డెలివరీ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కారుకు స్టీరింగ్ వీల్ ఎడమ వైపున ఉండటం గమనిఉంచవచ్చు. సాధారణంగా ఇండియాలో కనిపించే కార్లన్నింటికీ.. కుడివైపునే స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇతర దేశాల్లో కారులో స్టీరింగ్ వీల్ ఎడమవైపున ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే.. ఇక్కడ కనిపించే బెంజ్ కారును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కారు వీఐపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ”500” కలిగి ఉండటం చూడవచ్చు.

ఇక్కడ కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 అనేది హార్డ్‌టాప్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. ఒకప్పుడు ఇది అంతర్జాతీయ మార్కెట్లో గొప్ప ప్రజాదరణ పొందింది. ఇందులో కొన్ని భారత్‌కు కూడా దిగుమతి అయ్యాయి. ఈ కారు 5.0 లీటర్ వీ8 మోటారు ద్వారా 306 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిల్వర్ రంగులో కనిపించే ఈ కారు రెడ్ కలర్ ఇంటీరియర్ పొందుతుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

రతన్ టాటా ఉపయోగించిన ఇతర కార్లు

పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఉపయోగించిన కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 మాత్రమే కాకుండా.. ఫెరారీ కాలిఫోర్నియా టీ (Ferrari California T), కాడిలాక్ ఎక్స్ఎల్ఆర్ (Cadillac XLR), క్రిస్లర్ సెబ్రింగ్ (Chrysler Sebring), మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యు124 (Mercedes Benz W124), మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ (Mercedes Benz S-Class), ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 (Land Rover Freelander 2), హోండా సివిక్ (Honda Civic), టాటా ఇండిగో మరీనా (Tata Indigo Marina), టాటా నెక్సాన్ (Tata Nexon) మరియు టాటా నానో ఈవీ (Tata Nano EV) మొదలైనవి ఉన్నాయి.

టాటా నానో ఈవీ

రతన్ టాటా ఉపయోంచే కార్లలో ఎంత ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉన్నప్పటికీ.. టాటా నానో ఎలక్ట్రిక్ కారుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దీనిని కంపెనీ ప్రత్యేకంగా రతన్ టాటా కోసం రూపొందించింది. రతన్ టాటా కూడా ఎక్కువగా ఈ కారు డ్రైవ్ చేస్తూనే కనిపించారు. నిజానికి టాటా నానో ఎలక్ట్రిక్ కారు అధికారికంగా మార్కెట్లో లాంచ్ కాలేదు. అయితే కంపెనీ రతన్ టాటా కోసం ఒక్క కారును మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసింది. రాబోయే రోజుల్లో నానో ఈవీ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నాము.

Don’t Miss: మీకు తెలుసా!.. 2025లో భారత్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే

ప్రతి ఒక్క కుటుంబం కారుకు కలిగి ఉండాలి అనే గొప్ప ఆలోచనతోనే.. రతన్ టాటా టాటా నానో కారుకు శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో ఇది గొప్ప అమ్మకాలను పొందినప్పటికీ.. ఆ తరువాత దీనికున్న ఆదరణ క్రమంగా తగ్గిపోయింది. కాబట్టి కంపెనీ ఇప్పుడు దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఇది మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది.