Rashmika Comments On Vijay Devarakonda Kingdom Teaser: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అనగానే.. చాలామందికి విజయ్ దేవరకొండ కూడా గుర్తుకోచేస్తాడు. ఎందుకంటే వీరిరువురు డేటింగ్‌లో ఉన్నట్లు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో వీరు జంటగా కలిసి బయట కూడా ఎన్నోసార్లు కనిపించారు. గత సంవత్సరం దీపావళిని దేవరకొండ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకున్న ఈ అమ్మడు.. గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్స్ సినిమాల్లో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. అయితే తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన వీడీ 12 (VD 12) లేదా కింగ్‌డమ్ (Kingdom) టీజర్ లాంచ్‌పై రష్మిక స్పందించింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
నటి రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్ చూసిన తరువాత, ‘దిస్ మ్యాన్ ఆల్వేస్ కమ్ విత్ సంథింగ్ మెంటల్.. చాలా గర్వంగా ఉంది విజయ్ దేవరకొండ” అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్త నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
రష్మిక మందన్న విజయ్ దేవరకొండ సినిమాలు లేదా టీజర్స్ మీద స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో విజయ్ దేవరకొండను ప్రశంసిస్తూ కూడా పోస్టులు చేసింది. కాగా మారోమారు ప్రశంసిస్తూ పోస్ట్ చేసింది. దీంతో రూమర్స్ ఇంకాస్త ముదిరింది.
విజయ్ దేవరకొండ
2012లో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమాలో కనిపించిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్స్, వరల్డ్ ఫేమస్ లవర్, ఖుషి మరియు లైగర్ మొదలైన సినిమాల్లో నటించాడు. ఇప్పుడు కింగ్‌డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఇక టీజర్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాల కంటే కింగ్‌డమ్ చాలా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ లవ్, రొమాంటిక్ సినిమాలకు పరిమితమైన దేవరకొండ ఇప్పుడు ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికి విడుదలైన టీజర్ దేవరకొండ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా తప్పకుండా గొప్ప సక్సెస్ సాధిస్తుందని పలువురు చెబుతున్నారు. ఈ సినిమా 2025 మే 30న రిలీజ్ అవుతుందని సమాచారం.
రష్మిక మందన్న (Rashmika Mandanna)
చలో సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం, మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించింది. ఆ తరువాత పుష్ప, పుష్ప 2 సినిమాల్లో అల్లు అర్జున్ సరసన నటించి బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఛావా సినిమాలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రష్మిక రూ. 10 కోట్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే భవిష్యత్తులో పుష్ప 3 సినిమా రిలీజ్ అయితే.. అందులో కూడా రష్మిక మందన్న కనిపించనుంది.
నటి రష్మిక మందన్న సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. విలాసవంతమైన జీవితం గడుపుతూ, ఖరీదైన కార్లను ఉపయోగిస్తోంది. రష్మిక ఉపయోగించే కార్ల జాబితాలో రేంజ్ రోవర్ (Range Rover), ఆడి క్యూ3 (Audi Q3), మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ (Mercedes Benz C Class), టయోటా ఇన్నోవా క్రిష్టా (Toyota Innova Crysta) మరియు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) వంటివి ఉన్నాయి. రష్మిక మందన్న నెట్‍వర్త్ రూ. 70 కోట్లకంటే ఎక్కువే అనే తెలుస్తోంది.
Also Read: శ్రీవల్లి (రష్మిక) వాడే కార్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే.. ఒక్కో కారు అంత రేటా?
విజయ్ దేవరకొండ కార్ కలెక్షన్స్
నటుడు విజయ్ దేవరకొండ కూడా ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్నారు. ఈయన గ్యారేజిలోని కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5 Series), ఫోర్డ్ మస్టాంగ్ (Ford Mustang), రేంజ్ రోవర్ (Range Rover) మరియు వోల్వో ఎక్స్‌సీ90 (Volvo XC90) మొదలైనవి ఉన్నాయి. ఇకపోతే విజయ్ ఒక్కో సినిమాకు రూ. 80 కోట్ల నుంచి రూ. 90 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇతని నెట్‍వర్త్ వందల కోట్లలో ఉంటుందని సమాచారం.