Daily Horoscope in Telugu 6th April 2025 Sunday: ఆదివారం (2025 మార్చి 05). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు. యమగండం 12:00 నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు. ఇక ఆదివారం రాశిఫలాల విషయానికి వస్తే..
మేషం
చేపట్టిన పనులలో కొంత ఆటంకం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగంలో ఊహించని మార్పులు జరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.
వృషభం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఇంటాబయట అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. దైవ చింతన పెరుగుతుంది.
మిథునం
ఆర్థిక పురోగతి చాలా బాగుంటుంది. బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమంలో ఓ కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
కర్కాటకం
బంధువులతో మాటపట్టింపులు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఊహించని ఖర్చులు ఎక్కువవుతాయి. వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. కీలకమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
సింహం
ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి. ఇంటాబయట చికాకులు తప్పవు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయం పనికిరాదు. దైవ చింతన పెరుగుతుంది.
కన్య
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పెద్దల సలహాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి.
తుల
ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. ఉద్యోగంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నూతన ఒప్పందాలు వాయిదా పడతాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. అవసరానికి తగిన ధనం చేకూరుతుంది.
వృశ్చికం
శుభవార్తలు వినిపిస్తాయి. అవసరానికి తగిన ధనం లభిస్తుంది. విద్యార్థులకు శుభయోగం. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులతో.. పరిచయం కొంత లాభదాయకంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో.. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
ధనుస్సు
సన్నిహితులతో చిన్న చిన్న వివాదాలు తలెత్తుతాయి. కీలకమైన వ్యవహారాల్లో ఆశించిన ఫలితం లభించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు లాభదాయకంగా ఉంటాయి.
మకరం
వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలను విజయవంతంగా ఎదుర్కొంటారు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ప్రయత్నాలు లాభసాటిగా ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది.
కుంభం
ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటాబయట సానుకూల వాతావరణం. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో అవరోధాలు తొలగిపోతాయి. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మీనం
దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలున్నాయి. తొందరపాటు నిర్ణయాలు ఆపదలు కలిగిస్తాయి. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
గమనించండి: పాఠకులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రాశిఫలాలు అవగాహన కోసం మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయమైన అధరాలు లేదు. రాశిఫలాలు గ్రహ స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి పైన చెప్పినవే జరుగుతాయని గానీ, తప్పకుండా జరగవని గానీ నిర్దారించలేము.