Daily Horoscope in Telugu 10th April 2025 Thursday: గురువారం (10 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. యమగండం ఉదయం 6:00 నుంచి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:00 నుంచి 10:48 వరకు. నేటి రాశిఫలాలు విషయానికి వస్తే..
మేషం
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంటాబయట అనుకూలమైన వాతావరణం. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో ఒడిదుడుకులను అధిగమిస్తారు. విలువైన వస్తువుల కొనుగోలు సాధ్యమవుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు వద్దు.
వృషభం
శక్తికి మించిన ఖర్చులు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు కూడా అనుకూలంగా ముందుకు సాగవు. దైవ చింతన పెరుగుతుంది.
మిథునం
బంధుమిత్రులతో చిన్న వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్ధిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగులు ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారు.. కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో కూడా కొంత ఒత్తిడి ఉంటుంది.
కర్కాటకం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ మాట తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఆకస్మిక ధనలాభం, దూరప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
సింహం
నూతన వస్తువుల కొనుగోలు, సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం, ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాలను కలిగిస్తాయి.
కన్య
ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లేదా స్థాన చలనం. కుటుంబ విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఇంటాబయట అనుకూల వాతావరణం. పెద్దలు సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి.
తుల
అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారం మరియు ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
వృశ్చికం
ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహంగా ఉంటుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని పనులు అధిక శ్రమతో పూర్తవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం, అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
ధనుస్సు
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో మీదే విజయం. వ్యాపార విస్తరణ వేగవంతం అవుతుంది. ఉద్యోగుల పనికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది.
మకరం
బంధువుల నుంచి ఆర్ధిక పరమైన ఒత్తిడి. శ్రమకు తగిన ఫలితం లభించదు. నమ్మినవారే ముమ్మల్ని మోసం చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఓ వార్త మిమ్మల్ని బాధిస్తుంది. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం
శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం, ఒత్తిడి తగ్గుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
మీనం
ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఉద్యోగులకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు తలెత్తుతాయి.
గమనించండి: రాశిఫలాలు కేవలం సూచన ప్రాయం మాత్రమే. పాఠకుల అవగాహన కోసం. కాబట్టి రాశిఫలాలు ఇలాగే జరగాలని అనుకోకూడదు. ఎందుకంటే.. రాశుల ఫలితాలు గ్రహాల స్థితిగతుల మీద కూడా ఆధారపడి ఉంటాయి. వీటికి ఎలాంటి శాస్త్రీయమైన అధరాలు లేవు. పాఠకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.