Daily Horoscope in Telugu 11th April 2025 Friday: శుక్రవారం (11 ఏప్రిల్ 2025).. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. ఇక రాశిఫలాలు విషయానికి వస్తే..
మేషం
ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. బంధు మిత్రుల నుంచి అమితమైన ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి శుభయోగం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది.
వృషభం
ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులతో కొంత జాగ్రత్త అవసరం. సన్నిహితులతో మాటపట్టింపులు ఉన్నాయి. నూతన కార్యకమాలు ప్రారభించకపోవడం ఉత్తమం. పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. శ్రమకు తగిన ఫలితం లభించదు.
మిథునం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమంలో కొంత మందకొడిగా సాగుతాయి. నిరాశకు లోను కాకుండా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఉద్యోగులపై అదనపు భారం పడుతుంది. ఆర్థిక విషయం కొంత నిరుత్సాహపరుస్తుంది.
కర్కాటకం
శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి మునుపటికంటే మెరుగ్గా ఉంటుంది. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
సింహం
కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త పరిచయాల వల్ల కొన్ని విలువైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగ ప్రాప్తి ఉంది. వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
కన్య
ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో స్థిరాస్తి వివాదాలు తలెత్తుతాయి. కీలకమైన వ్యవహారములు నిదానంగా సాగుతాయి. అనుకున్నది సాధించాలంటే కొంత ఓపిక అవసరం. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
తుల
ఇంతాబయట ప్రతికూల వాతావరణం. ఉద్యోగంలో వివాదాలు, మిత్రుల వల్ల సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాల్సి అవసరం చాలా ఉంది. మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వల్ల కొంత ప్రశాంతత లభిస్తుంది.
వృశ్చికం
ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు తొలగిపోయి.. సజావుగా ముందుకు సాగుతాయి. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఇంటాబయట అనుకూలంగా ఉంటుంది. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనుస్సు
కుటుంబ సభ్యులతో చిన్న వివాదాలు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు కాలం కలిసి రాదు. ఓపికగా ఎదురు చూడాల్సి ఉంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
మకరం
ముఖ్యమైన కార్యక్రమాలు వేగవంతగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. అవసరానికి మించిన ఖర్చులు ఉన్నాయి. ఖర్చుల విషయంలో కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది.
కుంభం
ముఖ్యమైన వ్యవహారాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి.. ప్రశాంతంగా ముందుకు సాగిపోవాలి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
మీనం
మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక సమస్యలు సమసిపోతాయి. ఆర్ధిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
గమనించండి: 12 రాశుల ఫలితాలు.. గ్రహాల స్థితి గతుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాశిఫలాలలో చిన్న మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ధరలు లేదని పాఠకులు గ్రహించాలి.