Daily Horoscope in Telugu 13th April 2025 Sunday: ఆదివారం (2025 ఏప్రిల్ 13). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు. యమగండం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు. ఇక రాశిఫలాల విషయానికి వస్తే..
మేషం
ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత ప్రతికూలంగానే ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో వివాద సూచనలు ఉన్నాయి. కొంత అప్రమత్తంగా ఉండటం మంచిది.
వృషభం
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వాహన కొనుగోలు. సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోయి.. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.
మిథునం
ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల ప్రసంశలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటకం
దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, పాత ఋణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి వాతావరణం, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి కొంత మందకొడిగా ఉంటుంది.
సింహం
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు, అనవసరమైన ఖర్చులు విపరీతమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు నిరుత్సాహంగా ఉంటాయి. ఇంటాబయట కొంత గందరగోళ పరిస్థితి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దల సలహాలు లాభదాయకంగా ఉంటాయి.
కన్య
శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో అనుకున్న విధంగానే మంచి లాభాలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో కొంత ఆలోచించాల్సి ఉంది.
తుల
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం. పెద్దల సలహాలు లాభాలను చేకూరుస్తాయి.
వృశ్చికం
ముఖ్యమైన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకున్న విధంగా ఉండదు. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. పనిలో శ్రమ అధికమవుతుంది. ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి. సన్నిహితులతో కలహాలు ఉన్నాయి. కొంత జాగ్రత్త వహించాలి.
ధనుస్సు
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కుటుంబంలో గందరగోళ వాతావరణం. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది.
మకరం
అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటాబయట ప్రశాంతమైన వాతావరణం. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉత్సాహకరంగా వాతావరణం, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది.
కుంభం
కీలకమైన వ్యవహారాల్లో.. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సన్నిహితులతో వివాదాలు. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలలో కొత్త వారితో ఏర్పడే పరిచయం కొంత లాభిస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం అవసరం.
మీనం
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కీలక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు శుభయోగం, ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో వాయిదా.
గమనిక: రాశిఫలాలు పాఠకుల అవగాహన కోసం మాత్రమే. గ్రహ స్థితుల కారణంగా ఫలితాలు కొంత తారుమారు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పైన చెప్పిన విషయాలే జరుగుతాయని గానీ, ఖచ్చితంగా జరగవు అని గానీ వెల్లడించలేము. పాఠకులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఏమి జరిగినా అది ఈశ్వర సంకల్పం అని భావించి మందుకు వెళ్ళాలి. అప్పుడే జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది.