Daily Horoscope in Telugu 14th April 2025 Monday: సోమవారం (14 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. యమగండం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు. సోమవారం రాశిఫలాలు విషయానికి వస్తే..
మేషం
ముఖ్యమైన వ్యవహారాల్లో మీదే విజయం. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు శుభయోగం. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి.
వృషభం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మిథునం
మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదం. చిన్న చిన్న విషయాలు కూడా మనసును బాధిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి, అధికారులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన కార్యక్రమాల నిర్వహణ కోసం అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు ఏ మాత్రం పనికిరాదు. దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటకం
శ్రమకు తగిన ఫలితం లభించదు. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి, అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడియాగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత నిరుత్సాహపడుతుంది. సన్నిహితులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. దైవ చింతన పెరుగుతుంది.
సింహం
దూరప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం కొంత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో.. అధికారుల నుంచి ప్రశంసలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య
ముఖ్యమైన కొన్ని కీలక వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తవవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ద్రుష్టి సారిస్తారు. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వేచి చూడండి.
తుల
మానసిక ప్రశాంతత కరువవుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశను కలిగిస్తుంది. ఇంటాబయట ప్రతికూల పరిస్థితి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆశించిన స్థాయిలో లాభాలను గడిస్తారు. పెద్దల సలహాలు లాభం కలిగిస్తాయి.
వృశ్చికం
కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్ధిక పరిస్థితి కూడా మందగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ధనుస్సు
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు. విద్యార్థులకు శుభయోగం, పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనపరుస్తారు.
మకరం
ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతికూల వాతావరణం, అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కుంభం
నిరుద్యోగులకు శుభయోగం. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులలో పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. వ్యాపారంలో లాభాలను గడిస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. జాగరూకగా ఉండటం మంచిది.
మీనం
ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలు సైతం మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత చికాకును కలిగిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. అయినప్పటికీ తొందరపడకుండా ఉంటే.. తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది.
గమనించండి: రాశిఫలాలు పాఠకుల ఆవాహన కోసం మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన అధరాలు లేవు. కాబట్టి పైన చిప్పినవన్నీ తప్పకుండా జరుగుతాయని ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాశిఫలాలు గ్రహాల స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. ఫలితాలు ఎలా ఉన్నా.. మనిషి దృడంగా ఉన్నప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి.