Daily Horoscope in Telugu 2025 April 1st Tuesday: మంగళవారం (2025 ఏప్రిల్ 1). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు.
మేషం
ఆకస్మిక ధనలాభం ఉంది. బంధువుల దగ్గర నుంచి శుభకార్యాలకు ఆహ్వానం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. నూతన కార్యక్రామాలు చేపడతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది.
వృషభం
మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఇంటాబయట ప్రతికూల పరిస్థితులు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్నవిధంగా ముందుకు సాగవు. కీలక విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాల్లో లాభాలు అంతంత మాత్రమే ఉంటాయి. సన్నిహితులతో అకారణ వివాదాలు తలెత్తుతాయి.
మిథునం
శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. బంధు మిత్రులతో అకారణ వివాదాలు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు శుభయోగం నడుస్తోంది. దూరప్రయాణాలు విరమించుకోవడం ఉత్తమం. పుణ్యక్షేత్రకను సందర్శిస్తారు.
కర్కాటకం
ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభయోగం నడుస్తోంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
సింహం
ఉద్యోగులకు అదనపు భారం, చేపట్టిన పనులు వాయిదా పడతాయి. భూ సంబంధ వివాదాలు తలెత్తుతాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి.
కన్య
నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాల కోసం పెట్టుబడులు పెడతారు. ఇంటాబయట ఆశాజనక వాతావరణం. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం.
తుల
ఈ రాశివారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి మించిన ఖర్చులు ఉన్నాయి. సన్నిహితులతో సమస్యలు ఎదురవుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
వృశ్చికం
సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక ఋణాలు వసూలవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని కీలకమైన విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
ధనుస్సు
మొండి బకాయిలు వసూలవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఓ ముఖ్యమైన విషయం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.
మకరం
అనవసరమైన ఖర్చలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి క్షీనిస్తుంది. ఉద్యోగులకు అదనపు పనిభారం. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన పనులు మెల్లగా సాగుతాయి. అలోచించి తీసుకున్న నిర్ణయాలే మీకు శుభం కలిగిస్తాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు అలోచించి మాట్లాడాలి. తొందరపాటు పనికిరాదు.
కుంభం
నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభించదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. పెద్దల సలహాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి.
మీనం
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు సమసిపోతాయి. ఆర్ధిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. కొత్తవారిని నమ్మవద్దు. నూతన కార్యక్రమాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఋణబాధలు తొలగిపోతాయి.
గమనించండి: రాశిఫలాలు పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. కాబట్టి పైన చెప్పినవన్నీ జరుగుతాయని, తప్పకుండా జరిగే అవకాశం లేదని నిర్దారించలేము. పరిస్థితులు దైవాధీనం. కాబట్టి ఎప్పుడు ఏమి జరుగుతుందో ఖచ్చితంగా చెప్పడం దాదాపు అసాధ్యమే. పాఠకులు ఇవి తప్పకుండా గుర్తుంచుకోవాలి.