Daily Horoscope in Telugu 2025 March 10th Monday: సోమవారం (2025 మార్చి 10). శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, శుక్ల పక్షం, పాల్గుణమాసం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. యమగండం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. అమృత గడియలు రాత్రి 11:58 నుంచి 1:34 వరకు.
మేషం
చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచింది. సన్నిహితులతో మాటపట్టింపులు, ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగులకు స్దాన చలనం ఉంది. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దైవ చింతన శుభం కలిగిస్తుంది.
వృషభం
ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన వస్తువుల కొనుగోలు ఉంది. ఆర్ధిక వృద్ధి మంచిగానే ఉంటుంది. ఉద్యోగులకు ప్రశంసలు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం ఉంది.
మిథునం
ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగాలలో పదోన్నతులు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించే ముందు.. పెద్దల సలహా తీసుకోవడం మంచిది.
కర్కాటకం
ఏ పని చేసిన కొంత నిరాశే మిగులుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. నూతన ఋణ ప్రయత్నాలు కూడా అసాధ్యమే. శ్రమకు తగిన ఫలితం లేదు. దైవ దర్శనం శుభం కలిగిస్తుంది.
సింహం
ఇంటా బయట సమస్యలు. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్ధిక సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగులపై ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ దర్శనం మనోబలాన్ని ఇస్తుంది.
కన్య
సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు శుభయోగం, ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం. ఆకస్మిక ధనలాభం ఉంది. దైవ చింతన పెరుగుతుంది.
తుల
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
వృశ్చికం
విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం ఉంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ఉంది. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవడం అవసరం. ఆర్ధిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
ధనుస్సు
నిరుద్యోగులకు శుభయోగం, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు వద్దు. అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధువర్గంలో మాటపట్టింపులు ఉన్నాయి. దైవ దర్శనం శుభం కలిగిస్తాయి.
మకరం
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నితులతో సమయం గడుపుతారు. ముఖ్యమైన వ్యక్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్ధిక పరమైన లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కుంభం
ఏ పని తలపెట్టినా విజయం చేకూరుతుంది. ఉద్యోగులలో నూతనోత్సాహం. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబలో సంతోషం, దేవాలయాల దర్శనం చేస్తారు.
మీనం
వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపడుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు. వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. శ్రమకు తగ్గ ఫలితం కొంత ఆలస్యం అవుతుంది. దైవారాధన మనశ్శాంతిని ఇస్తుంది.
గమనించండి: రాశిఫలాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. గ్రహాల స్థితిగతులు, నక్షత్రాల పరిస్థితులు మొదలైన వాటిని బేరీజు వేసుకుని రాశిఫలాలు నిర్ణయిస్తారు. అయితే గ్రహాల తీరులో మార్పులు జరిగితే.. ఫలితాలు కూడా తలకిందులయ్యే అవకాశం ఉంది. మంచి జరిగే స్థానంలో చెడు, చెడు జరిగే స్థానంలో మంచి జరగవచ్చు. కాబట్టి రాశిఫలాలలో చెప్పిందే జరుగుతుందని అపోహ వద్దు.