Daily Horoscope in Telugu 2025 March 12th Wednesday: శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గుణ మాసం, శుక్ల పక్షం.. బుధవారం (12 మార్చి 2025). రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. అమృత ఘడియలు రాత్రి 01:38 నుంచి 03:18 వరకు.
మేషం
ఈ రాశివారు కొంత ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణం సూచనలు ఉన్నాయి. కుటుంబంలో చికాకులు, దైవ చింతన పెరుగుతుంది.
వృషభం
ఓ శుభవార్త వింటారు. సన్నిహితులతో కాలం గడుపుతారు. స్వల్ప తగాదాలున్నవి. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు అధికారుల నుంచి ఒత్తిడి పెరిగినప్పటికీ.. నేర్పుతో వ్యవహరించాల్సిన సమయం ఇది. ఆర్ధిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. దైవ నామస్మరణ శుభం కలిగిస్తుంది.
మిథునం
ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులకు తగిన డబ్బు సమకూరుతుంది. స్త్రీ సంబంధ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో చిన్నపాటి తగాదాలు ఉండవచ్చు. అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కర్కాటకం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుకు ప్రశంసలు ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతాయి.
సింహం
నూతన కార్యక్రమాల విషయంలో, పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యమైన పనులు కూడా నెమ్మదిగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం, చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.
కన్య
పని ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో మీ మాటకు విలువ తగ్గుతుంది. ఆర్ధిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్ధిక సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు.. సఫలీకృతం అవుతాయి. విద్యార్థులకు శుభయోగం, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.
తుల
వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఉత్తమం. బంధువర్గంలో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో.. మాటపట్టింపులు ఉన్నాయి. ఆర్ధిక పరమైన విషయాల్లో ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంది. దైవ ప్రార్థన మనశ్శాంతిని ఇస్తుంది.
వృశ్చికం
నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు
పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగులకు శుభయోగం, పనికి తగ్గ ఫలితం లభిస్తుంది. అవసరానికి డబ్బు అందుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు వద్దు.
మకరం
ఆర్ధిక పరిస్థితి దిగజారుతోంది. నూతన కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది. ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఇంటా బయట అనవసర సమస్యలు. సంఘంలో గౌరవం తగ్గుతుంది. ఏ మాత్రం నిరాశకు గురికావొద్దు. దైవ దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాన్ని కలిగిస్తాయి.
కుంభం
శుభవార్తలు వింటారు. సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో తలెత్తే చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయి.
Also Read: సమ్మర్‌లో పెసలు.. ఆరోగ్యానికి ఎంతో స్పెషల్: ఎలా తినాలంటే?
మీనం
ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆలోచన ప్రధానం. మీరు తీసుకునే నిర్ణయాలే.. మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి. దూరప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
గమనించండి: రాశిఫలాలు గ్రహాల స్థితిగతుల ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి గ్రహాలలో జరిగే మార్పుల వల్ల ఫలితాలు తారుమారు కావొచ్చు. కాబట్టి దైవ దర్శనం, దైవ నామ స్మరణ తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తుంది.