Daily Horoscope in Telugu 2025 March 19th Wednesday: బుధవారం (19 మార్చి 2025). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. అమృత గడియలు ఉదయం 7:52 గంటల నుంచి 9:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:24 వరకు.
మేషం
అవసరానికి తగిన ధనం అందదు. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో స్దాన చలనం. సన్నిహితులతో విభేదాలు ఉన్నాయి. నూతన ఋణప్రయత్నాలు నెరవేరవు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభం
కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. ఆర్ధిక వృద్ధి బాగుంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తవుతాయి. అవసరానికి కావలసిన ధనం చేకూరుతుంది. ఉద్యోగంలో అధికారుల ప్రసంశలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దైవ దర్శనాలు చేసుకుంటారు.
మిథునం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల ఆగమనం సంతోషాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ.. సకాలంలో పనులు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
కర్కాటకం
విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలం. ఇంటా బయట అనుకూల వాతావరణం. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాలను తెస్తాయి.
సింహం
ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్న కలహాలు. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
కన్య
నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నూతన వ్యాపారాలు మొదలు పెడతారు. సన్నిహితుల సహాయంతో కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన పనులలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
తుల
ముఖ్యమైన కార్యక్రమంలో కొంత మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుని లాభాలను గడిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
వృశ్చికం
వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. ఆర్ధిక వృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. దైవ దర్శనం శుభం కలిగిస్తుంది. అలోచించి తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తులో మీకు అండగా నిలుస్తాయి.
ధనుస్సు
ఆకస్మిక ప్రయాణాలను చేయాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం శూన్యం. చేపట్టిన పనులు ఆశాజనకంగా ముందుకు సాగవు. సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
మకరం
ఉద్యోగంలో వృద్ధి, అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు.
కుంభం
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. ఆర్ధిక సమస్యలు కొంత తొలగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
మీనం
నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఒక శుభవార్త మిమ్మల్ని ఎంతో సంతోషానికి గురి చేస్తుంది. చిన్ననాటి స్నేహితులతో కాలం గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన ఆలోచనలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే కొంత అనుకూలంగానే ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది.
గమనించండి: రాశిఫలాలు అనేవి కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎందుకంటే దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేదు. అంతే కాకుండా రాశిఫలాలు గ్రహాల స్థితి గతుల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఎలాంటి మార్పు జరుగుతుందో.. ఎవరూ ఊహించలేరు. పాఠకులు దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి.