Daily Horoscope in Telugu 2025 March 20th Thursday: గురువారం (20 మార్చి 2025). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. యమగండం ఉదయం 6:00 నుంచి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:00 నుంచి 10:48 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:41 నుంచి 5:29 వరకు.
మేషం
శుభ యోగం నడుస్తోంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటాబయట గౌరవం. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
వృషభం
ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. సన్నిహితులతో వివాదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలోచించి తీసుకునే నిర్ణయాలు శుభఫలితాలను అందిస్తాయి.
మిథునం
కీలక వ్యవహారాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
కర్కాటకం
విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ద వహించాలి.
సింహం
వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. కీలక వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. సంతాన విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సన్నిహితులతో స్వల్ప తగాదాలు. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కన్య
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమకు తగిన ఫలితం లేదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి వివరాలు కొంత చిరాకును కలిగిస్తాయి.
తుల
మొండి బకాయిలు వసూలవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబంలో మాటపట్టింపులు ఉన్నాయి.
వృశ్చికం
ఓ శుభవార్త మిమ్మల్ని ఎంతగానో సంతోషపెడుతుంది. అవసరానికి రావలసిన ధనం చేతికి వస్తుంది. ఇంటాబయట సంతోషకరమైన వాతావరణం. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిస్తాయి. చాలాకాలంగా పూర్తికాని కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ధనుస్సు
సన్నిహితులతో కాలం గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృధా ఖర్చులు ఉన్నాయి. అవసరానికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో అకారణ మాటపట్టింపులు ఉన్నాయి. వ్యాపారంలో ఊహకందని సమస్యలు. అవసరానికి ఎవరి సహాయం అందక ఇబ్బందిపడతారు. ఏ పని చేసినా.. అలోచించి తీసుకునే నిర్ణయాలే శుభం కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి.
కుంభం
ముఖ్యమైన పనులు ఓ కొలిక్కి వస్తాయి. బంధువులతో ఆనందంగా కాలం గడుపుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. మొండి బాకాయిలు సైతం వసూలవుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మీనం
కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహాలు ఓ కొలిక్కి వస్తాయి. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీనికి శాస్త్రీయ అధరాలు లేదు. గ్రహాల స్థితిగతులను బట్టి రాశిఫలాలు కూడా మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పైన చెప్పిన విషయాలే తప్పకుండా జరుగుతాయని గానీ.. ఖచ్చితంగా జరగవని గానీ.. నిర్దారించలేము. పాఠకులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.