Daily Horoscope in Telugu 2025 March 21 Friday: శుక్రవారం (2025 మార్చి 21). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:41 నుంచి 5:28 వరకు.
మేషం
ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తవుతాయి. ఇంటబయట ప్రశాంతమైన వాతావరణం. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
వృషభం
అనవసరమైన ఖర్చులు ఉన్నాయి. దూరప్రయాణాలు చేస్తారు. అవసరానికి కావలసిన ధనం అందడంలో ఆలస్యం. వ్యాపారాలు సైతం మందగిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి. దైవ చింతన మీకు శుభం కలిగిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
మిథునం
విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటాబయట కొంత చికాకు. ఆప్తుల నుంచి విలువైన బహుమతులు అందుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనుల కోసం అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
కర్కాటకం
కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మీకు శుభం కలుగుతుంది.
సింహం
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఉద్యోగంలో చికాకులు. అధికారుల నుంచి ఒత్తిడి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటాయి. అవసరానికి రావలసిన ధనం అందదు. ముఖ్యమైన వ్యవహాలు సైతం మందకొడిగా సాగుతాయి.
కన్య
వ్యాపారాల్లో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. శ్రమకు తగిన ఫలితం లభించదు. విద్యార్థులకు శుభయోగం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సన్నిహితులతో వివాదాలు.
తుల
అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగంలో కూడా అనుకూల వాతావరణం. దూరప్రయాణాలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది.
వృశ్చికం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. అవసరానికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలం. చాలాకాలంగా ఓ కొలిక్కిరాని సమస్యలు సైతం పీపరిష్కారమవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ధనుస్సు
ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తెలియనివారితో సావాసం ప్రమాదహేతువు.
మకరం
నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కీలక వ్యవహారాల్లో చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ.. నెమ్మదిగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద అవసరం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కనిపించవు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అవసరానికి కావలసిన ధనం చేతికి అందదు.
కుంభం
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. గృహంలో సంతోషకరమైన వాతావరణం. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మీనం
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో అకారణంగా వివాదాలు. ఉన్నతోద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు ఉన్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం లేదు. ఇంటా బయట చికాకులు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి.
గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీనికి ఎటువంటి శాస్త్రీయమైన ధరలు లేదు. కాబట్టి ఇక్కడ చెప్పినవన్నీ జరుగుతాయని గానీ.. తప్పకుండా జరగవని మేము ద్రువీకరించలేము. అంతే కాకుండా రాశిఫలాలు.. గ్రహాల స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి.