Daily Horoscope in Telugu 2025 March 22nd Saturday: శనివారం (22 మార్చి 2025). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:45 నుంచి 6:27 వరకు.
మేషం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. ఆకస్మిక ధనలాభం ఉంది. ఇంటాబయట గౌరవం పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
వృషభం
సన్నిహితులతో వివాదాలు, దూర ప్రయాణాల్లో అవరోధాలు. ఉద్యోగులకు.. అధికారుల నుంచి ఒత్తిడి. ఇంటాబయట చికాకు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అవసరానికి ధనం చేకూరదు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆధ్యాత్మిక సేవలలో పాల్గొంటారు.
మిథునం
శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కార్యక్రమాలు మీ నేర్పుతో పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉన్నాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు.
కర్కాటకం
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు శుభయోగం. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశించిన ధనం అందుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఇంటాబయట సానుకూలంగా ఉంటుంది.
సింహం
ఉద్యోగులు ప్రతికూల సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు అవసరం. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభించకపోయినా.. ఓపిగ్గా ఎదురు చూస్తే ఫలితం తప్పకుండా లభిస్తుంది.
కన్య
నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. స్థిరాస్తి ఒప్పందాలలో అవాంతరాలు ఏర్పడతాయి. ఉద్యోగులు.. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ముఖ్యమైన కార్యక్రామాలు మందగిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
తుల
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు రానప్పటికీ.. సానుకూలంగా సాగుతాయి. కీలకమైన వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి.
వృశ్చికం
ఉద్యోగులు శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి కనిపించదు. శ్రమకు తగిన ఫలితం లేదు. అవసరానికి రావలసిన ధనం అందదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి అడుగులు వేయాలి.
ధనుస్సు
ముఖ్యమైన పనులు సజావుగా ముందుకు సాగవు. వ్యాపారాల్లో ఊహకందని నష్టాలు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
మకరం
ఆర్ధిక పరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. సన్నిహితులతో వివాదాలు ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటికి తావు ఇవ్వకండి. స్థిరాస్తి వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఉద్యోగంలో అదనపు పనిభారం. ఆధ్యాత్మిక సేవలలో పాల్గొంటారు. మీ ఓపిక మీకు శుభం కలిగిస్తుంది.
కుంభం
సమస్యలను దైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. సన్నిహితుల నుంచి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు0 నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు పెడతారు. అవసరానికి తగిన ఆదాయం లభిస్తుంది. కొన్ని విషయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీనం
నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. ఆర్ధిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అవసరానికి కావలసిన ధనం అందదు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా నత్తనడకన సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయమైన లేదా సాంకేతికమై ఆధారాలు లేదు. గ్రహస్తితులను బట్టి ఫలితాలను అంచనా వేయడం మాత్రమే జరుగుతుంది. పాఠకులు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.