Daily Horoscope in Telugu 2025 March 29 Saturday: శనివారం (2025 మార్చి 29). శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం, అమావాస్య. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:49 నుంచి 5:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు. నేటి రాశిఫలాల విషయానికి వస్తే..
మేషం
ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు ఎదురవుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీ సంతానం మీ మాటలతో విభేదిస్తారు. కుటుంబలో చికాకు వాతావరణం. ఆర్ధిక పరిస్థితి కొంత దిగజారుతోంది.
వృషభం
తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. నిరుద్యోగులు ఇంకా కొన్ని రోజులు కష్టపడాల్సి ఉంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. విలువైన వస్తువుల కొనుగోలు కూడా వాయిదా పడుతుంది. అవసరానికి చేతికి అందాల్సిన డబ్బు అందదు. ఇంటాబయట చికాకు వాతావరణం. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
మిథునం
పాత బాకీలు వసూలవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత బయటపడతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలలో సానుకూలత. కుటుంబంలో కొంత గందరగోళ వాతావరణం. దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటకం
సన్నిహితుల నుంచి ముఖ్యమైన ఒక సమాచారం అందుతుంది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఇంటాబయట ప్రతికూల వాతావరణం. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అలోచించి తీసుకునే నిర్ణయాలే.. భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి.
సింహం
ఆకస్మిక ధన లాభం ఉంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు పదోన్నట్లు. అన్నింటా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు కూడా ఓ కొలిక్కి వస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు.
కన్య
అవసరానికి మించిన ఖర్చులు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి కొంత మందగిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు నిరాశను కలిగిస్తాయి. సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
తుల
ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు సుభావార్తలు వింటారు.
వృశ్చికం
స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్ధిక పరిస్థితి ముందుకంటే ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం, ఉన్నతోద్యోగుల ఆదరణ పెరుగుతుంది.
ధనుస్సు
అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. దూరప్రయాణాలు చేస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్ధిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం
ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇంటాబయట ప్రతికూల వాతావరణం. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. అకారణ వివాదాలు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది.
కుంభం
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్ధిక పరిస్థితి సానుకూలంగానే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పాత ఋణాలు తీరుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.
మీనం
కార్య సిద్ది ఉంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.
గమనించండి: రాశిఫలాలు అవగాహన కోసం మాత్రమే. కాబట్టి పైన చెప్పినవన్నీ జరుగుతాయని తప్పకుండా నిర్దారించలేము. అయితే మనిషి ఎప్పుడు అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రోజు అమావాస్య.. కాబట్టి దైవ దర్శనం చేసుకోవడం మంచిదని సలహా. రాశిఫలాలు గ్రహాల స్థితి గతులను బట్టి మారే అవకాశం ఉంది. పాఠకులు గుర్తుంచుకోగలరు.