Daily Horoscope in Telugu 2025 March 31 Monday: సోమవారం (2025 మార్చి 31). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్ల పక్షం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. యమగండం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు. ఈ రోజు రాశిఫలాలు విషయానికి వస్తే..
మేషం
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు లేదా ముఖ్యమైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు శుభయోగం నడుస్తోంది. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు.
వృషభం
ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కీలక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో పని ఒత్తిడి, అధికారులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు కూడా మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం
సన్నిహితులతో అనవసరమైన తగాదాలు, ఉద్యోగంలో స్థాన చలనం. వ్యాపారాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. అనవసరమైన ఖర్చులు ఉన్నాయి. ఆర్ధిక విషయాల్లో ఆచి తూచి అడుగులు వేయాలి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి.
కర్కాటకం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది.
సింహం
అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత క్షిణిస్తుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కుటుంబంలో కొంత గందరగోళ వాతావరణం. ఇంటాబయట ప్రతికూల పరిస్థితులు. దైవ చింతన పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
కన్య
వృత్తి, వ్యవహాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అవసరానికి తగిన ధనం అందుతుంది. అలోచించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
తుల
ప్రయాణాల్లో అనుకోని అవరోధాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మానిసిక ఆందోళన పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. అలోచించి ఖర్చు పెట్టడం మంచిది. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.
వృశ్చికం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి మునుపటికంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగానే ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది.
ధనుస్సు
ఆర్ధిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్తువుల కొనుగోలు ఉంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది.
మకరం
ఇంటాబయట ప్రతికూల వాతావరణం. ఆర్ధిక సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కీలక విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహాలు ఉపయోగపడతాయి.
మీనం
కార్యసిద్ధి ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చాలాకాలంగా పూర్తికాని పనులు కూడా పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు శుభయోగం. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
గమనించండి: రాశిఫలాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పేరు, జన్మ నక్షత్రం వంటి వాటి ఆధారంగా ఫలితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయమైన అధరాలు లేదు. పాఠకులు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.