Daily Horoscope in Telugu 21st April 2025 Monday: సోమవారం (21 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణ పక్షం. అష్టమి 20వ తేదీ మధ్యాహ్నం నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 1:49 వరకు. తరువాత నవమి. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. యమగండం 10:30 నుంచి 12:00 వరకు. ఇక ఈ రోజు రాశిఫలాల విషయానికి వస్తే..
మేషం
బాధ్యతలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంటాబయట అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సన్నిహితులతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారంలో లాభాలను గడిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
వృషభం
ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
మిథునం
ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనలాభం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ వాతావరణం అనుకూమగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి సరైన సమయం. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
కర్కాటకం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది.
సింహం
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత ధైర్యంగా వ్యవహరించండి. మీ పనికి.. అందరి మన్ననలు లభిస్తాయి. అప్పులు కొంత వరకు తీరుతాయి. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే కొంత బాగుంటుంది.
కన్య
మిత్రుల నుంచి అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలమైన సమయం. తొందరపాటు వద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
తుల
ఆదాయ మార్గాలు కొంత పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల శుభం కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.
వృశ్చికం
వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు ఎదురైనప్పటికీ.. సమస్యలు నిదానంగా పరిష్కారమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన కాలం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో.. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
ధనుస్సు
ఇంటాబయట అనుకూలమైన వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు శుభయోగం ఉంది. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నతపదవులు, శుభవార్తలు వింటారు. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
మకరం
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. శుభవార్తలు వింటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. తొందరపాటు వద్దు.
కుంభం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంది. స్థిరాస్థి సంబంధిత కార్యక్రమాలు లాభాలను చేకూరుస్తాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అన్నింటా అనుకూల వాతావరణం.
మీనం
కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వస్తు, వాహన యోగం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగుతాయి. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది.
గమనించండి: రాశిఫలాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి ఎటువంటి శాస్త్ర, సాంకేతికమైన ఆధారాలు లేదు. అంతే కాకుండా గ్రహ స్థితి గతుల ఆధారంగా.. రాశిఫలాలు మారే అవకాశం ఉంటుంది. వీటిని పాఠకులు తప్పకుండా గుర్తించుకోవాలి.