శనివారం (26 ఏప్రిల్). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు. తిథి: త్రయోదశి 25వ తేదీ ఉదయం 8:21 నుంచి, 26వ తేదీ ఉదయం 6:11 వరకు. ఆ తరువాత చతుర్దశి. నేటి రాశిఫలాలు విషయానికి వస్తే..
మేషం
చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినప్పటికీ.. నెమ్మదిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగవు. ఆకస్మిక దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, విశ్రాంతి కరువవుతుంది. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే భారంగా ఉంటుంది.
వృషభం
కుటుంబ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. చికాకులు, సమస్యలు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. విలువైన వస్తు, వాహన కొనుగోలు వాయిదా వేస్తుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో.. తొందరపాటు పనికిరాదు. ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందదు. నిరుద్యోగులు మరింత శ్రమ చేయాల్సి వస్తుంది.
మిథునం
ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్తవారితో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారంలో సానుకూల ఫలితాలు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో కొంత చికాకులు. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
బంధు, మిత్రులతో అనవసర తగాదాలు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువుగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆదాయం తక్కువ, అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం లభించదు, నిరాశ చెందకుండా శ్రమిస్తే.. తప్పక విజయం మీదే.
సింహం
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం. వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
కన్య
ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. సన్నిహితులతో.. చిన్నపాటి విభేదాలు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి. ఖర్చుల విషయంలో కొంత ఆచి తూచి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
తుల
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దైవ చింతన పెరుగుతుంది.
వృశ్చికం
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వినిపిస్తాయి. ముఖ్యమైన పనులలో విజయం చేకూరుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారంలో ఆశించిన లాభాలను గడిస్తారు. ఉద్యోగంలో సానుకూల వాతావరణం.
ధనుస్సు
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు దైవానుగ్రహంతో పూర్తవుతాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మకరం
ప్రతికూల ప్రభావం నడుస్తోంది. అన్నింటా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. ఉద్యోగులకు అదనపు భారం.. అధికారులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు.
కుంభం
దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం. వ్యాపారంలో అదనపు బాధ్యతలు. ఉద్యోగులకు శుభయోగం. అధికారుల నుంచి ప్రశంసలు. శ్రమకు తగిన ఫలితం ఉంది.
మీనం
నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీ ఆలోచనలే భవిష్యత్తును నిర్మిస్తాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది.
గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. కాబట్టి ఇక్కడ చెప్పినవన్నీ తప్పకుండా జరుగుతాయని గానీ.. జరగవని గానీ మనం నిర్దారించలేము. ఎందుకంటే రాశిఫలాలు.. గ్రహాల స్థితి గతుల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని పాఠకులు గుర్తుంచుకోవాలి.