ఆదివారం (27 ఏప్రిల్) అమావాస్య. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు. యమగండం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు. తిథి అమావాస్య 27వ తేదీ రాత్రి 1:22 నుంచి 28వ తేదీ రాత్రి 1:22 వరకు. ఆ తరువాత పాడ్యమి. రాశిఫలాలు విషయానికి వస్తే..
మేషం
దాయాదులతో ఊహించని వివాదాలు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా ముందుకు సాగవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా.. నమ్మకం కోల్పోకూడదు. దైవ చింతన పెరుగుతుంది.
వృషభం
ఇంటాబయట ఒత్తిడి వాతావరణం, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగుల అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దైవ చింతన పెరుగుతుంది.
మిథునం
ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. సంఘంలోని కొత్త వ్యక్తుల పరిచయం లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను మెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కర్కాటకం
ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, అధికారుల నుంచి ఒత్తిడి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. ఓపికతో ఎదురుచూడటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
సింహం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆలోచించాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది.
కన్య
సన్నిహితులతో కలహాలు, ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. అవసరానికి చేతికి అందాల్సిన డబ్బు చేతికి అందదు. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత బాధిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి వాతావరణం. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకుంటారు.
తుల
ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు మిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో పురోగతి, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
వృశ్చికం
ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో లాభాలున్నాయి. వ్యాపారంలో అవరోధాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో.. సొంత నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. నమ్మకంతో ముందుకు సాగండి, మంచి ఫలితాలు లభిస్తాయి.
ధనుస్సు
కష్టానికి తగిన ఫలితం కనిపించదు. శ్రమ ఎక్కువ ఫలితం శూన్యమనే చెప్పాలి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉన్నాయి. పాత బాకీలు తీర్చడానికి.. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మకరం
ఇంటాబయట ప్రతికూల ప్రభావం, వివాదాలకు దూరంగా ఉండాలి. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కష్టాలను కలిగిస్తాయి. అన్నివేళలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం
ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. గృహంలో వివాహ ప్రయత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగులకు శుభయోగం, అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి.
మీనం
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కీలక వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తవుతాయి. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితులతో సంతోషంగా కాలం గడుపుతారు. దైవ చింతన పెరుగుతుంది.
గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కొరకు మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేదు. అంతే కాకుండా రాశిఫలాలు గ్రహాల స్థితిగతుల మీద కూడా ఆధారపడి ఉంటాయి. పాఠకులు ఇవన్నీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.