Daily Horoscope in Telugu 2nd April 2025 Wednesday: బుధవారం (02 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:24 వరకు. ఇక రాశిఫలాల విషయానికి వస్తే..
మేషం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం.
వృషభం
ఆర్ధిక వ్యవహారాలలో నిరుత్సాహం. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దూరప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది.
మిథునం
ముఖ్యమైన పనులలో అవరోధాలు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదం.
కర్కాటకం
బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన విషయాల్లో సన్నిహితుల సలహాలు ఉపయోగపడతాయి. వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కీలక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.
సింహం
బంధు మిత్రులతో మాటపట్టింపు. ఆర్ధిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి, అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అవసరానికి కావలసిన ధనం అందదు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది.
కన్య
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
తుల
నూతన వ్యాపారాలు కలిసి రావు. ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి క్షీనిస్తుంది. ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
వృశ్చికం
ఇంటాబయట సంతోషకరమైన వాతావరణం, సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయం కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చుల పట్ల కొంత జాగ్రత్త అవసరం.
ధనుస్సు
కొత్త వ్యక్తుల పరిచయం కొంత లాభదాయకంగానే ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావణం ప్రశాంతంగా సాగుతుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదు.
మకరం
అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంతమాత్రంగానే ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు పని భారం ఎక్కువవుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
కుంభం
ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొంత ప్రతికూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల తీరు కొంత ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉన్నాయి. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
మీనం
ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటాబయట అనుకూలంగానే ఉంటుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగులకు శుభయోగం.
గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.. వీటికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేదు. అంతే కాకుండా రాశిఫలాలు అనేవి.. గ్రహాల కదలిక మీద కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి రాశిఫలాలను ఎవరూ ఖచ్చితంగా నిర్దారించలేరు.