Daily Horoscope in Telugu 3rd April 2025 Thursday: గురువారం (2025 ఏప్రిల్ 3). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. యమగండం ఉదయం 6:00 నుంచి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:00 నుంచి 10:48 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:33 నుంచి 5:20 వరకు.
మేషం
ఈ రాశివారికి శుభయోగం నడుస్తోంది. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉత్సాహకరమైన వాతావరణం. కీలక వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం
కార్య సిద్ది, ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రసంసలు. ఆసరాలకు కావలసిన ధనం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు.
మిథునం
ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. చేపట్టిన పనులకు అంతరాయాలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటకం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖుల పరిచయం మీ అభివృద్ధికి దోహదపడుతుంది.
సింహం
ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వ్యాపార కార్యకలాపాలకు అవరోధాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు.
కన్య
ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి. అవసరానికి అందవలసిన డబ్బు చేతికి అందదు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో పనిభారం తగ్గుతుంది, నిరుద్యోగుల ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. పెద్దల సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి.
తుల
ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు లాభదాయకంగా ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
వృశ్చికం
చేప్పట్టిన కార్యక్రమాల కోసం అధికంగా శ్రమిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. తొందరపాటు పనికిరాదు.
ధనుస్సు
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలలో అవరోధాలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతోషంగా సమయం గడుపుతారు.
మకరం
మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి.
కుంభం
ఈ రాశివారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉండదు. వ్యాపారంలో కొత్త సమస్యలు. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది. అవసరానికి తగిన ధనం చేతికి అందదు.
మీనం
ఆర్ధిక సమస్యలు ఇబ్బందిపెడతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. సన్నిహితులతో సమస్యలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.. లేకుంటే మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
గమనించండి: రాశిఫలాలు అవగాహన కోసం మాత్రమే. గ్రహాల స్థితిగతుల ఆధారంగా వీటిని నిర్ణయించడం జరుగుతాయి. అయితే గ్రహాల స్దాన చలనం వల్ల.. ఫలితాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. దీనికి ఎటువంటి సాంకేతిక లేదా శాస్త్రీయమైన ఆధారాలు లేదు. పాఠకులు ఈ విషయాన్ని గ్రహించాలి.