శుక్రవారం (2025 ఏప్రిల్ 04). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజాము 4:33 నుంచి 5:19 వరకు. ఇక ఈ రోజు రాశిఫలాల విషయానికి వస్తే..
మేషం
కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం. అవసరానికి కావలసిన ధనం చేతికందుతుంది. చిన్ననాటి స్నేహితులతో కాలం గడుపుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రసంసలు ఉన్నాయి.
వృషభం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులున్నాయి, జాగ్రత్తగా వ్యవహరించాలి.
మిథునం
ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగవు. కుటుంబంలో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కీలక వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్ధిక పరిస్థితి కూడా కొంత గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటకం
శ్రమకు తగిన ఫలితం లభించదు. ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఓపిగ్గా వ్యవహరించడం ఉత్తమం.
సింహం
వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు ఆహ్వానం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉన్నాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. దైవ చింతన పెరుగుతుంది.
కన్య
ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగంలో అధికారుల నుంచి సమస్యలు తలెతుటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సేవ కార్యక్రమాల్లో హాజరవుతారు. ఆర్ధిక పరిస్థితి మునుపటికంటే మెరుగ్గా ఉంటుంది.
తుల
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం. నూతన వ్యాపారాలకు పెట్టుబడి లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్థులకు సంబంధించిన క్రయ, విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.
వృశ్చికం
ఈ రాశివారు కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవాలసి వస్తుంది. అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
ధనుస్సు
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఇస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ద్రుష్టి సారిస్తారు. కుటుంబంలో వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
మకరం
ఉద్యోగులకు శుభయోగం. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ఉంది. అన్నివైపుల నుంచి ఆదాయం లభిస్తుంది. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభం
దూరపు బందుబుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తీసుకోవలసి ఉంటుంది. కొన్ని పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ.. నెమ్మదిగా ముందుకు సాగుతాయి. ఖర్చుల విషయంలో మరోమారు ఆలోచించడం మంచిది.
మీనం
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఉద్యోగంలో స్థానచలనం ఉంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో అలోచించి తీసుకున్న నిర్ణయాలే మీకు శుభం కలిగిస్తాయి.
గమనించండి: రాశిఫలాలు పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీనికి ఎటువంటి శాస్త్రీయమైన, సాంకేతికమైన అధరాలు లేదు. ఫలితాలు గ్రహస్థితిగతులను బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.