Daily Horoscope in Telugu 5th April 2025 Saturday: శనివారం (2025 ఏప్రిల్ 05). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు.
మేషం
ఈ రాశివారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సన్నిహితులతో స్వల్ప విభేదాలు, ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు, దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు.
వృషభం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా కాలం గడుపుతారు. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన ప్రోత్సాహం ఉంటుంది. ఇంటాబయట అనుకూల వాతావరణం. అవసరానికి ధనం అందుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు.
మిథునం
ఉద్యోగులకు శుభయోగం, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. దైవ చింతన అవసరం.
కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కీలక అంశాల్లో వృద్ధి కనిపిస్తుంది. ఆర్ధిక పురోగతి కొంత మందగిస్తుంది. సన్నిహితుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
సింహం
కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల.. ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి దిగజారుతోంది. జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.
కన్య
ముఖ్యమైన పనులు అప్రయత్నంగానే పూర్తవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి ఆర్ధిక సహాయం అందుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు.
తుల
ఇంటాబయట ఒత్తిడి, పెద్దల సహకారం లభిస్తుంది. దూరప్రయాణాలు అలసట కలిగిస్తాయి. ఉద్యోగులకు అధిక శ్రమ. వ్యాపారంలో లాభాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. అన్ని మందకొడిగానే ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.
వృశ్చికం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనాల కొనుగోలు ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగానే ఉంటాయి. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు.. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
ధనుస్సు
ఊహకందని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు. వ్యాపారంలో నిరాశ, లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. దూరప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి. అలోచించి తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తులో శుభం కలిగిస్తాయి.
మకరం
విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి కావలసిన ధనం చేతికి అందదు. దైవ చింతన పెరుగుతుంది.
కుంభం
దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధనలాభం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగానే పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగుల తగిన గుర్తింపు లభిస్తుంది.
మీనం
కీలక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణంలో చికాకు. ఉద్యోగులకు ఒత్తిడి అధికమవుతుంది. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులను కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
గమనించండి: రాశిఫలాలు లేదా రాశి ఫలితాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. గ్రహాల కదలికను బట్టి ఫలితాలను నిర్ణయించడం జరుగుతుంది. అయితే గ్రహాలు ఎప్పటికప్పుడు స్థానచలనం చెందుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏమి జరుగుతుందనేది చెప్పడం దాదాపు అసాధ్యం. పాఠకులు దీనిని గుర్తుంచుకోవాలి.