Daily Horoscope in Telugu 7th April 2025 Monday: సోమవారం (2025 మర్చి 07). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. యమగండం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు. ఇక ఈ రోజు రాశిఫలాల విషయానికి వస్తే..
మేషం
అకారణ వివాదాలు జరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. శ్రమకు తగిన ప్రతిఫలం శూన్యం. ఉద్యోగంలో ఒత్తిడి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి డీలా పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
వృషభం
అవసరానికి మించిన ఆదాయం లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తవుతాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి.
మిథునం
అవరోధాలు తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి ధనం అందుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కర్కాటకం
సన్నిహితుల నుంచి అనుకోని సమస్యలు, బంధువులతో మాట పట్టింపులు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.
సింహం
అవసరానికి మించిన ఖర్చు. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు ఏర్పడాతాయి. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కన్య
దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటా బయట కొంత ప్రతికూల వాతావరణం. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సానుకూల వాతావరణం. వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల
నిరుద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. ఏ మాత్రం నిరాశ చెందకుండా ప్రయత్నాలను కొనసాగించాలి. సన్నిహితులతో అకారణ వివాదాలు తలెత్తుతాయి. నూతన ప్రయత్నాలు అనుకున్న విధంగా ముందుకు సాగవు. కుటుంబలో కలహాలు. వీలైనంత ఓపిగ్గా ఉండటం మంచిది. మౌనమే సమాధానం అయితే సమస్యలు తొలగిపోతాయి.
వృశ్చికం
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు కొంత లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు
దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ద వహించాలి. ముఖ్యమైన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగంలో కూడా కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంది. దైవ చింతన పెరుగుతుంది.
మకరం
సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగానే పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలను గడిస్తారు. నిరుద్యోగులకు శుభయోగం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది.
కుంభం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కార్య సిద్ది ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి తొలగిపోతుంది. ఇంటాబయట అనుకూల వాతావరణం. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయల్సి ఉంటుంది. తొందరపాటు పనికిరాదు.
మీనం
మిత్రులతో వివాదాలు ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు, నమ్మకాన్ని కోల్పోకూడదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. మానసిక సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు కనిపించవు. కొత్త వ్యక్తుల పరిచయం కొంత ఉపయోగకరంగా ఉంటుంది.
గమనించండి: రాశిఫలాలు.. పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఈ ఫలితాలు గ్రహాల స్థితిగతుల కారణంగా తారుమారు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పైన చెప్పినవన్నీ తప్పకుండా జరుగుతాయని లేదా జరగవని నిర్దారించలేము. దైవం మీద నమ్మకంతో.. నిజాయితీగా చేసే పనులకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. పాఠకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.