Daily Horoscope in Telugu 9th April 2025 Wednesday: బుధవారం (09 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:24 వరకు. ఈ రోజు 12 రాశుల ఫలితాల విషయానికి వస్తే..
మేషం
కుటుంబంలో వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలు కూడా మందగిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభం
శ్రమకు తగిన ఫలితం లభించదు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కెన్నిహితులతో వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగులు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దైవ చింతన పెరుగుతుంది.
మిథునం
శుభవార్తలు వింటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో కొన్ని ఊహకందని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలకు సంబంధించిన విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం.
కర్కాటకం
ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషం. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారం నందు ఆశించిన లాభాలను పొందుతారు. సొంత నిర్ణయాలే భవిష్యత్తను నిర్మిస్తాయి.
సింహం
ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. శ్రమకు తగిన ఫలితం కొన్ని వ్యవహారాలలో లభించదు. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి, అధికారులతో జాగ్రత్తగా మసలుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.
కన్య
ముఖ్యమైన కార్యక్రమాల్లో తొందరపాటు పనికిరాదు. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి. అవసరానికి కావలసిన ధనం చేతికి అందదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు శుభయోగం. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.
తుల
సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. నూతన వాహన కొనుగోలు ఉంది. వ్యాపారం విస్తరించడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది.
వృశ్చికం
ఆర్ధిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాలి. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
ధనుస్సు
శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంటాబయట సంతోషకరమైన వాతావరణం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
మకరం
అయినవాళ్ల దగ్గర.. ఊహకందని మాటలు పడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కీలకమైన వ్యవహారాల్లో అవరోధాలు తలెత్తుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఆర్ధిక విషయాల్లో కొంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కుంభం
ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. అలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తు బాగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఏ విషయంలో అయినా తొందరపాటు పనికిరాదు.
మీనం
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.
గమనించండి: రాశిఫలాలు.. పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఇందులో చెప్పినవే జరుగుతాయని, ఖచ్చితంగా జరగవని చెప్పడానికి సాధ్యం కాదు. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేదు. అంతే కాకుండా గ్రహాల స్థితిగతుల ఆధారంగా.. రాశిఫలాలు మారే అవకాశం కూడా ఉంది. పాఠకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.