Renault Night and Day Editions Launched in India: ఆధునిక భారతదేశంలో కొత్త వాహనాలు లాంచ్ అవుతున్న తరుణంలో ‘రెనాల్ట్’ (Renault) కంపెనీ కూడా సరికొత్త ‘నైట్ అండ్ డే’ స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేసింది. ఇందులో క్విడ్, ట్రైబర్ మరియు కైగర్ ఉన్నాయి. ఇవన్నీ పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తాయి. రెనాల్ట్ లాంచ్ చేసిన ఈ సైట్ అండ్ డే ఎడిషన్స్ గురించి పూర్తి వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
ధరలు & బుకింగ్స్
రెనాల్ట్ సంస్థ లాంచ్ చేసిన నైట్ అండ్ డే (Night & Day) ఎడిషన్స్ మూడు మోడళ్లలో లభిస్తాయి. కంపెనీ ఈ కార్ల కోసం ఈ రోజు (సెప్టెంబర్ 17) నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ కార్లను పరిమిత సంఖ్యలో (కేవలం 1600 యూనిట్లు) మాత్రమే విక్రయిస్తుంది. కాబట్టి వీటిని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ముందుగా బుక్ చేసుకోవడం ఉత్తమం.
- క్విడ్ ఎంటీ నైట్ అండ్ డే ఎడిషన్: రూ. 5 లక్షలు
- కైగర్ ఏఎంటీ నైట్ అండ్ డే ఎడిషన్: రూ. 7.25 లక్షలు
- కైగర్ ఏంటీ నైట్ అండ్ డే ఎడిషన్: రూ. 6.75 లక్షలు
- ట్రైబర్ ఏంటీ నైట్ అండ్ డే ఎడిషన్: రూ. 7 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్)
డిజైన్
రెనాల్ట్ కంపెనీ లాంచ్ చేసిన ఈ నైట్ అండ్ డే ఎడిషన్ అన్నీ కూడా ఎంట్రీ లెవెల్ ఆర్ఎక్స్ఎల్ (ఓ) మరియు ఆర్ఎక్స్ఎల్ ఆధారంగా రూపొందించడం జరిగింది. నైట్ అండ్ డే ఎడిషన్స్ యొక్క రూప్ బ్లాక్ కలర్ పొందుతాయి. రూప్ కాకుండా మిగిలిన చాలా భాగం పెర్ల్ వైట్ కలర్ స్కీమ్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని వీల్ కవర్లు, గ్రిల్ ఇన్సర్ట్స్, బ్యాడ్జింగ్స్ మరియు టెయిల్ గేట్ అన్నీ కూడా పియానో బ్లాక్ కలర్ పొందుతాయి.
కంపెనీ లాంచ్ చేసిన ఈ మూడు నైట్ అండ్ డే ఎడిషన్స్ కేవలం 1600 మందికి మాత్రమే విక్రయిస్తారు. అంటే ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి పరిమిత సంఖ్యలోనే విక్రయాలు ఉంటాయి. ఈ స్పెషల్ ఎడిషన్ చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినా అనేక కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది.
ఫీచర్స్
కొత్త రెనాల్ట్ నైట్ అండ్ డే స్పెషల్ ఎడిషన్స్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులోని ఫీచర్స్ దాదాపు స్టాండర్డ్ మోడల్లోని మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. కాబట్టి ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ రేప్లికేషన్, రియర్ వ్యూ కెమెరా మరియు 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్స్ ఉంటాయి. ట్రైబర్ నైట్ అండ్ డే ఎడిషన్స్ వెనుక పవర్ విండోస్ పొందుతాయి. కాబట్టి ఈ స్పెషల్ ఎడిషన్ స్పెషల్ డ్రైవింగ్ అనుభవాన్నే అందిస్తాయని భావిస్తున్నాము.
ఇంజిన్ వివరాలు
రెనాల్ట్ నైట్ అండ్ డే ఎడిషన్స్ డిజైన్ మరియు ఫీచర్లలో కొంత అప్డేట్స్ ఉన్నప్పటికీ ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి క్విడ్ నైట్ అండ్ డే ఎడిషన్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.
ట్రైబర్ నైట్ అండ్ డే ఎడిషన్ 72 హార్స్ పవర్ అందించే 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కైగర్ స్పెషల్ ఎడిషన్ 72 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 68 హార్స్ పవర్ డెలివరీ చేసే 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇవి రెండూ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతాయి.
Don’t Miss: రైడింగ్‌కు సిద్దమైపోండి.. 2024 అపాచీ ఆర్ఆర్ 310 వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి
కొత్త రెనాల్ట్ నైట్ అండ్ డే స్పెషల్ ఎడిషన్స్ ధరలు దాని ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ల కంటే రూ. 20000 ఎక్కువ. అయితే ఈ ధరకు తగిన ఫీచర్స్ పొందవచ్చు. ఇవి స్పెషల్ ఎడిషన్స్.. దేశీయ విఫణిలో వీటికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. కాబట్టి ఇవి ఉత్తమ అమ్మకాలను పొందుతాయని భావిస్తున్నాము.