Revolt RV BlazeX Electric Bike Launched In India: భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన ‘రివోల్ట్ మోటార్స్’ (Revolt Motors).. ఎట్టకేలకు మరో సరసమైన బైక్ ‘ఆర్‌వీ బ్లేజ్ఎక్స్’ (RV BlazeX) లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ చేసిన ఆర్‌వీ 400 మరియు ఆర్‌వీ1 కంటే కూడా ఇది చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
ధర & బుకింగ్స్
రివోల్ట్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే. ఈ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 499తో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.
చూడటానికి ఆర్‌వీ1 బైక్ మాదిరిగా కనిపించే.. ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ బైక్ రౌండ్ హెడ్‌ల్యాంప్ కలిగి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ మరియు సైడ్ ప్యానెల్ వంటివి కూడా చూడచక్కగా ఉంటాయి. సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ బైక్ గ్రాబ్ రైల్ కూడా పొందుతుంది. బ్లేజ్ఎక్స్ బైకులోని అతిపెద్ద మార్పు లేదా అప్డేట్ ఏమిటంటే.. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు, ఇప్పటికే ఉన్న బ్రాండ్ యొక్క ఇతర బైకుల కంటే ఎక్కువ పవర్ డెలివరీ చేస్తుంది.
కలర్ ఆప్షన్స్ & ఫీచర్స్
కొత్త రివోల్ట్ ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి స్టెర్లింగ్ సిల్వర్ బ్లాక్ మరియు ఎక్లిప్స్ రెడ్ బ్లాక్ కలర్స్.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ లేటెస్ట్ బైకులో 6 ఇంచెస్ LCD స్క్రీన్ (ఇది వాహనం గురించి సమాచారం అందిస్తుంది), మూడు రైడింగ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్, జీపీఎస్ మరియు జియో ఫెన్సింగ్ వంటి యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. మొత్తం మీద ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.
Also Read: మార్కెట్లో ఉన్న అద్భుతమైన బైక్స్.. రెండు లక్షలుంటే చాలు కొనేయొచ్చు!
బ్యాటరీ అండ్ రేంజ్
రివోల్ట్ ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ బైక్ 3.24 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని 4.1 కేడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటార్ 5.49 Bhp పవర్ మరియు 45 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైకులోని బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జితో 150 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. రేంజ్ అనేది సాధారణ ఆర్‌వీ1 బైక్ కంటే 10 కిమీ తక్కువ.
స్పెసిఫికేషన్స్
ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఆర్‌వీ1 బైక్ మాదిరిగానే.. బ్లేజ్ఎక్స్ కూడా 790 మిమీ ఎత్తైన సీటు, 1350 మిమీ వీల్‌బేస్, 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. అయితే ఈ బైక్ బరువు (113 కేజీలు) ఆర్‌వీ1 కంటే 3 కేజీలు ఎక్కువ. అయితే పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుందని మాత్రం తెలుస్తోంది.