రోల్స్ రాయిస్ కల్లినన్ ఇప్పుడు మరింత కొత్తగా.. పూర్తి వివరాలు

Rolls Royce Cullinan Series II Facelift Revealed: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే ‘రోల్స్ రాయిస్’ కంపెనీ ఇప్పుడు అప్డేటెడ్ ‘కల్లినన్’ ఆవిష్కరించింది. గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రోల్స్ రాయిస్ కల్లినన్ సుమారు ఆరు సంవత్సరాల తరువాత అప్డేట్స్ పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డిజైన్

రోల్స్ రాయిస్ ఆవిష్కరించిన కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త డిజైన్, అప్డేటెడ్ ఇంటీరియర్, ఆధునిక టెక్నాలజీ పొందుతుంది. ఇందులో అప్డేటెడ్ ఫాసియాను పొందుతుంది. ముందు భాగంలో అప్డేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి. ఇది బంపర్ వరకు విస్తరించింది. గ్రిల్ కూడా చాలా కొత్తగా ఉండటం చూడవచ్చు. పైభాగంలో దిగువన సమాంతరంగా ఉండే క్రోమ్ బార్ ఉంటుంది.

సైడ్ ప్రొఫైల్ కూడా చాలా కొత్తగా ఉండటం చూడవచ్చు. ఇక్కడ ఒక లైన్ చూడవచ్చు. అది బ్రేక్ లైట్ నుంచి వెనుక చక్రం వరకు ఉంటుంది. రియర్ ప్రొఫైల్ స్టెయిన్‌లెస్ స్టీల్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన బాడీ డిజైన్ పొందుతుంది. అల్యూమినియం వీల్స్ మునుపటి కాంట్ ఒక అంగుళం పెద్దదిగా ఉన్నాయి. కాబట్టి వీల్స్ ఇప్పుడు 23 ఇంచెస్ వరకు ఉన్నాయి. బ్లాక్ డోర్ హ్యాండిల్స్, కలర్ కోడెడ్ లోయర్ బాడీవర్క్ మరియు ఎయిర్ ఇన్‌టేక్‌ల కోసం బెస్పోక్ ట్రీట్‌మెంట్‌ కలిగి సాధారణ కల్లినన్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది.

ఫీచర్స్

రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ కూడా చాలా అప్డేట్స్ పొందింది. డ్యాష్‌బోర్డ్‌లో గ్లాస్ ప్యానెల్‌ చూడవచ్చు. ప్రయాణికుల ముందు భాగంలో ప్రకాశవంతమైన సిటీస్కేప్ మోటిఫ్ ఉంటుంది. వైర్‌లెస్ కార్ కనెక్ట్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంటుంది. అనలాగ్ క్లాక్ మరియు దాని కింద స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ మస్కట్ వంటివి ఉన్నాయి.

కంపెనీ ఇప్పుడు దీనిని కొత్త పెయింట్ మరియు మెటీరియల్ ఆప్షన్‌లతో పరిచయం చేసింది. ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎలిమెంట్లలో కూడా గ్రే స్టెయిన్డ్ యాష్, మెటాలిక్ ఎఫెక్ట్ ఓపెన్ పోర్ వుడ్ ట్రిమ్, డ్యూయాలిటీ ట్విల్ మరియు సీట్ ఫాబ్రిక్ వంటివి ఉన్నాయి.

ఇంజిన్

అప్డేటెడ్ రోల్స్ రాయిస్ కల్లినన్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఎంత అప్డేట్స్ పొందిన ఇంజిన్ విషయంలో మాత్రం ఎటువంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి ఇది 6.75 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 600 హార్స్ పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

నిజానికి రోల్స్ రాయిస్ తన మొదటి కల్లినన్ కారును 2018లో మొదటిసారి పరిచయం చేసింది. ఆ తరువాత ఇప్పుడు అందులో అప్డేట్స్ అందిస్తూ సిరీస్ II పేరుతో లేదా ఫేస్‌లిఫ్ట్ పేరుతో పరిచయం చేసింది. అయితే ఈ కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది. ధర ఎంత వరకు ఉంటుంది అనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రపంచ మార్కెట్లో చాలామంది ధనవంతులు, సినీతారలు, పారిశ్రామిక వేత్తలు మరియు క్రికెటర్లు రోల్స్ రాయిస్ కార్లను ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ధర ఎక్కువ కావడం వల్ల రోల్స్ రాయిస్ కార్లను సాధారణ ప్రజలు కొనుగోలు చేయడానికి వెనుకాడతారు. అంతే కాకుండా రోల్స్ రాయిస్ కార్ల యొక్క మెయింటెనెన్స్ కూడా కొంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయమే. కాబట్టి రోల్స్ రాయిస్ కార్లు సాధారణ కార్ల మాదిరిగా అమ్ముడు కావు.

Don’t Miss: టయోటా ఇన్నోవా క్రిస్టా కొత్త వేరియంట్ వచ్చేసింది.. వివరాలు

రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క ఇతర కార్లతో పోలిస్తే.. కల్లినన్ SUVని ఎక్కువమంది కొనుగోలు చేస్తారు. కంపెనీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన బోట్ టెయిల్ కారును మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కారును (రోల్స్ రాయిస్ స్పెక్టర్) కూడా ప్రవేశపెట్టింది. ఇక రాబోయే రోజుల్లో కూడా కంపెనీ కొత్త కార్లను లేదా అప్డేటెడ్ కార్లను ప్రవేశపెడుతుందని భావిస్తున్నాము. అయితే ఎప్పుడు.. ఏ మోడల్ ప్రవేశపెడుతుందనేది తెలియాల్సి ఉంది.