Rolls Royce Spectre Launched: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే బ్రిటీష్ కంపెనీ ‘రోల్స్ రాయిస్’ (Rolls Royce) భారతదేశంలో స్పెక్టర్ (Spectre) లాంచ్ చేసింది. కంపెనీ నేడు ధరలు, బ్యాటరీ స్పెసిఫికేషన్స్, రేంజ్ వంటి వాటితో ఇతర వివరాలను కూడా అధికారికంగా వెల్లడించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర & బుకింగ్స్ (Rolls Royce Spectre Price & Bookings)
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.5 కోట్లు. ఇది కంపెనీ యొక్క మొట్ట మొదటి ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది కేవలం రెండు డోర్స్ మాత్రమే కలిగి ఉంటుంది. దీని కోసం కంపెనీ ఈ రోజు నుంచే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు కూడా వేగంగా ప్రారంభమవుతాయి.
బ్యాటరీ, రేంజ్ (Rolls Royce Spectre Battery And Range)
కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ పెద్ద 102 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక సింగిల్ చార్జితో 530 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 575 Bhp పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు 195 kW ఛార్జర్ ద్వారా 34 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేస్తుంది. అయితే 50 kW డీసీ ఛార్జర్ ద్వారా ఛార్జ్ కావడానికి 95 నిమిషాల సమయం పడుతుంది. సుమారు 2890 కేజీల బరువున్న ఈ కారు పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.
స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు రోల్స్ రాయిస్ యొక్క ఆల్ అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా దృఢంగా ఉంటుంది. ఇది యాక్టివ్ సస్పెన్షన్ మరియు ఫోర్ వీల్ స్టీరింగ్ కలిగి ఉంటుందని సమాచారం.
రోల్స్ రాయిస్ స్పెక్టర్ డిజైన్ (Rolls Royce Spectre Design)
చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు మంచి సిల్హౌట్ మరియు డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. ఫాస్ట్‌బ్యాక్ టైల్‌తో పొడవైన బోనెట్ కలిగి ఉన్న ఈ కారు ముందు భాగంలో విశాలమైన గ్రిల్ పొందుతుంది. రాత్రిపూట మరింత ప్రకాశవంతంగా కనిపించడానికి ఇందులో 22 ఎల్ఈడీ లైట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏరో-ఆప్టిమైజ్డ్ 21-అంగుళాల వీల్స్ మరియు నిలువు LED టెయిల్ లైట్లు ఉన్నాయి.
Don’t Miss: BMW Z4 M40i: కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న యమదొంగ నటి – ఫోటోలు వైరల్
రోల్స్ రాయిస్ స్పెక్టర్ మూడు రేఖల ద్వారా వర్గీకరించబడుతుంది. అవి వాలుగా ఉండే రూఫ్‌లైన్, షోల్డర్ లైన్ మరియు బేస్ వద్ద ఒక వాఫ్ట్ లైన్. ఇక వెనుక భాగంలో ఫాస్ట్‌బ్యాక్ టెయిల్ మరియు గ్లాస్‌హౌస్ చూడవచ్చు. ఫాస్ట్‌బ్యాక్ రూఫ్ ప్యానెల్ అనేది ఏ పిల్లర్ నుంచి లగేజ్ కంపార్ట్‌మెంట్ వరకు విస్తరించి ఉంది. పరిమాణం పరంగా ఈ కారు 5475 మిమీ పొడవు, 2017 మిమీ వెడల్పును కలిగి ఉంటుంది.
స్పెక్టర్ ఇంటీరియర్ (Rolls Royce Spectre Interior)
రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎక్స్టీరియర్ మాదిరిగానే, ఇంటీరియర్ కూడా ఇప్పటికే ఉన్న రోల్స్ రాయిస్ మోడల్‌ల మాదిరిగానే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు పైకప్పుపై మాత్రమే అందించబడిన స్టార్‌లైట్ లైనర్ ఇప్పుడు డోర్ ప్యాడ్‌లలో కూడా కనిపిస్తుంది. ప్యాసింజర్ వైపున ఉన్న డ్యాష్‌బోర్డ్ ప్యానెల్ ‘స్పెక్టర్’ నేమ్‌ప్లేట్‌తో ప్రకాశిస్తుంది. ఇందులో 5500 కంటే ఎక్కువ స్టార్స్ వంటి ఇల్యూమినేషన్‌ల క్లస్టర్‌తో చుట్టుముట్టబడింది. ఇంటీరియర్ బాడీ ప్యానెల్స్‌లో రియర్ సీట్లు కూడా పూర్తిగా కొత్తవి.