Royal Enfield Bear 650 Launched in India: దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).. చెప్పినట్లుగా తన ‘బేర్ 650’ లేదా ‘ఇంటర్‌సెప్టర్ బేర్ 650’ బైకును అధికారికంగా లాంచ్ చేసింది. 650 సీసీ విభాగంలో గొప్ప ప్రజాదరణ పొందిన కంపెనీ.. ఇప్పుడు మరో 650సీసీ బైక్ లాంచ్ చేత మరింత బలమైన ఉనికిని చాటుకోనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త బేర్ 650 బైక్ డిజైన్, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మరియు ధరల వంటి పూర్తి వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.
ధరలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త బేర్ 650 బైక్ ప్రారంభ ధర రూ. 3.39 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ బైక్ మొత్తం ఐదు వేరియంట్స్ లేదా ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ధర అనేది ఎంచుకునే వేరియంట్ / కలర్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది.
➤బోర్డ్‌వాక్ వైట్: రూ. 3.39 లక్షలు
➤పెట్రోల్ గ్రీన్: రూ. 3.44 లక్షలు
➤వైల్డ్ హానీ: రూ. 3.44 లక్షలు
➤గోల్డెన్ షాడో: రూ. 3.52 లక్షలు
➤టూ-ఫోర్-నైన్: రూ. 3.59 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా)
డిజైన్
రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క కొత్త బేర్ 650 బైక్.. బ్రాండ్ యొక్క 650 ట్విన్ ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఇంటర్‌సెప్టర్ 650 యొక్క కొన్ని ఫీచర్స్.. స్క్రాంబ్లర్ బైక్ యొక్క కొన్ని ఫీచర్స్ పొందుతుంది.
డిజైన్ పరంగా స్క్రాంబ్లర్ మాదిరిగా ఉన్న బేర్ 650 బైక్.. ఇంటర్‌సెప్టర్ స్టైల్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. డబుల్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్ కలిగి ఉన్న ఈ బైక్ యూఎస్డీ ఫోర్క్ పొందుతుంది. స్వింగ్‌ఆర్మ్ అనేది ఇంటర్‌సెప్టర్ కంటే కూడా కొంచెం పొడవుగా ఉంటుంది. ఎల్ఈడీ లైటింగ్ సెటప్ మీటియోర్ 650 మాదిరిగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ బైకులో ఎక్కువ గ్రాఫిక్ డిజైన్స్ చూడవచ్చు.
పొడవుగా, స్టైల్‌గా ఉన్న సీటు వెనుక భాగం కొంత పైకి లేచి ఉంటుంది. సైడ్ ప్యానెల్ మీద నెంబర్స్ వంటివి స్క్రాంబ్లర్ బైకును గుర్తుకు తెస్తుంది. ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 650 విభాగంలో టూ ఇన్ వన్ ఎగ్జాస్ట్ సిస్టం పొందిన మొదటి బైక్ ఈ బేర్ 650.
ఫీచర్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది గెరిల్లా మోడల్ మాదిరిగా 4.0 ఇంచెస్ రౌండ్ డాష్ పొందుతుంది. 650 సీసీ విభాగంలో సింగిల్ పాడ్ క్లస్టర్ పొందిన మొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్.. బేర్ 650 కావడం గమనార్హం. ఈ డిస్‌ప్లే.. ఫోన్ కనెక్టివిటీ, మ్యాప్ న్యావిగేషన్, రోజువారీ రైడింగ్ డేటా వంటివి చూపిస్తుంది. హ్యాండిల్ బార్ రేక్ వద్ద యూఎస్బీ టైప్-సీ ఛార్జ్ పోర్ట్ చూడవచ్చు.
ఇంజిన్ వివరాలు
కొత్త బేర్ 650 బైక్.. 648 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 7240 ఆర్‌పీఎమ్ వద్ద 47 బిహెచ్‌పీ పవర్ మరియు 5150 ఆర్‌పీఎమ్ వద్ద 56.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. టార్క్ అనేది ఇంటర్‌సెప్టర్ కంటే కూడా 4.2 Nm ఎక్కువ కావడం గమనించదగ్గ విషయం.
మెకానికల్స్
బేర్ 650 బైక్.. ఇంటర్‌సెప్టర్ 650 మాదిరిగా అదే చాసిస్ పొందినప్పటికీ.. సస్పెన్షన్ మరియు వీల్స్ భిన్నంగా ఉంటాయి. ఈ బైక్ ముందు భాగంలో 130 మిమీ ట్రావెల్‌తో షోవా యూఎస్డీ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయెల్ షాక్స్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. 320 మిమీ ఫ్రంట్ డిస్క్ మరియు 270 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఇందులో ఉంటుంది.
Don’t Miss: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే: ఫిదా చేస్తున్న లుక్ & వేరే లెవెల్ ఫీచర్స్
ప్రత్యర్థులు
భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన.. 216 కేజీల బరువున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650కు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే ఇది బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మరియు సొంత బ్రాండ్ అయిన ఇంటర్‌సెప్టర్ 650 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని సమాచారం. ఏది ఏమైనప్పటికీ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.