Royal Enfield Shotgun 650 Icon Edition Launched: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) దేశీయ విఫణిలో షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ సరికొత్త బైకును ఐకాన్ మోటార్‌స్పోర్ట్స్ సహకారం రూపొందించింది. ఈ బైక్ ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? సాధారణ మోడల్‌కు.. ఐకాన్ ఎడిషన్‌కు తేడా ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.
ధర
రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ ధర రూ. 4.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనికి కేవలం 100 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అర్హులని కంపెనీ తెలిపింది. ఈ సంఖ్యను భవిష్యత్తులో పెంచుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఈ బైక్ ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఆసియా పసిఫిక్ దేశాలు, యూరప్, అమెరికన్ మార్కెట్లలో కూడా అమ్మకానికి ఉండనున్నట్లు సమాచారం. ఈ బైక్ కొనాలనుకునే ఎవ్వరైనా.. తొందరగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి బహుశా తొందరగా అమ్ముడైపోయే అవకాశం ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే.. భారతదేశంలో 25 మంది మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు. ఎందుకంటే కంపెనీ భారత మార్కెట్ కోసం 25 యూనిట్లను మాత్రమే కేటాయించింది. ఈ బైక్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్ కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ జాకెట్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ జాకెట్ బైక్ పెయింట్‌కు సరిపోయే విధంగా ఉంటుంది.
డిజైన్ & కలర్స్
చూడటానికి ప్రత్యేకంగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ రెట్రో రేస్ గ్రాఫిక్స్ పొందుతుంది. ఇది మూడు రంగుల కలయికతో ఉంటుంది. బైక్ రిమ్ బంగారు రంగులో, రియర్ సస్పెన్షన్ నీలం రంగులో ఉండటం చూడవచ్చు. మెకానికల్స్ అన్నీ కూడా ప్రత్యేక పెయింట్ స్కీమ్ పొందుతాయి. ప్లోటింగ్ సీటు ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు. బార్ ఎండ్ మిర్రర్స్ నలుపు రంగులో ఉండటం చూడవచ్చు.
ఇంజిన్ డీటైల్స్
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్.. అధిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతాయి. యాంత్రికంగా ఎటువంటి మార్పులు లేవు. కాబట్టి ఇందులో.. అదే 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 హార్స్ పవర్, 51 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.
ఇండియన్ మార్కెట్లో సాధారణ షాట్‌గన్ 650 ధర రూ. 3.59 లక్షలు మాత్రమే. కానీ ఐకాన్ ఎడిషన్ ధర స్టాండర్డ్ మోడల్ కంటే రేప్. 66000 ఎక్కువ. అయితే ధరకు తగ్గ కాస్మొటిక్ అప్డేట్స్ లభిస్తాయి. ఈ బైక్ బుక్ చేసుకోవాలనుకునే వారు.. బ్రాండ్ అధికారిక యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న 25 మంది (భారతీయులు) మాత్రమే దీనిని కొనుగోలు చేయడానికి అర్హులు. ఎవరు కొనుగోలు చేయడానికి అర్హులు అనే విషయాన్ని కంపెనీ ఫిబ్రవరి 12 రాత్రి 8:30 గంటలకు వెల్లడించనున్నట్లు సమాచారం.
కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఎలాంటి అమ్మకాలు పొందుతుంది. ధర ఎక్కువగా ఉందని కొనుకోలు చేయడానికి వెనుకడుగు వేస్తారా? కలర్ ఆప్షన్ చూసి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారా అనేది వచ్చే బుధవారం (ఫిబ్రవరి 12) రోజున తెలుస్తాయి.
Also Read: ఈ కార్లనే ఎగబడి కొనేస్తున్నారు.. కొత్త ఏడాదిలో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే!
సాధారణ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల కంటే షాట్‌గన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ ఇది వరకు ఎప్పుడూ లాంచ్ చేయలేదు. కానీ మొదటిసారి.. వాహన ప్రేమికుల కోసం కంపెనీ ఈ సరికొత్త మోడల్ లాంచ్ చేసింది. భవిష్యత్తులో కంపెనీ ఇలాంటి మరిన్ని మోడల్స్ లాంచ్ చేస్తుందా? లేదా అనే విషయాలు.. ఇప్పుడు లాంచ్ చేసిన ఈ కొత్త ఎడిషన్ అమ్మకాలే నిర్ణయించే అవకాశం ఉందని భావిస్తున్నాము.