ఫిదా చేస్తున్న ‘సారా టెండూల్కర్’ లగ్జరీ కార్లు: వీటి ధరలు తెలుస్తే షాకవుతారు..

Sara Tendulkar Car Collection: సచిన్ టెండూల్కర్ గురించి తెలిసిన అందరికీ.. సారా టెండూల్కర్ గురించి తెలిసే ఉంటుంది. లండల్లో చదువుకున్న సారా ఇటీవల కొత్త బాధ్యతలు స్వీకరించింది. ఈ విషయాన్ని సచిన్ అధికారికంగా వెల్లడించారు.

టీమిండియా క్రికెటర్ సచిన్ గారాలపట్టి సారా టెండూల్కర్.. లండన్‌లో చదువుకున్నప్పటికీ ఇటీవల ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’ (STF) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. వైద్య రంగంకు అనుభవం ఉన్న సారా.. ఈ ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ ద్వారా పేద, దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పిస్తోంది. వారికి మెరుగైన విద్యాప్రమాణాలను అందించడానికి కృషి చేస్తోంది.

ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ (STF Foundation)

చదువుతో పాటు.. క్రీడారంగంలో నిపుణులుగా తీర్చిదిద్దడమే ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ ముఖ్యమైన ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ ఫౌండేషన్ బాధ్యతలను సారా టెండూల్కర్ తీసుకున్నారు. ఈ ఫౌండేషన్‌లో యువ ఇండియా, హై 5 యూత్ ఫౌండేషన్, ఐఎన్‌జీఏ, ముకుందా హాస్పటల్స్, మన్‌దేశి ఛాంపియన్, బేసిక్ హెల్త్‌కేర్ సర్వీసెస్, ఏకం ఫౌండేషన్, పరివార్, విద్యా వికాస్ యోజన, శ్రీజ మరియు ది సొసైటీ ఫర్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ క్రిపల్ట్ వంటి స్వచ్చంద సంస్థలు ఇందులో భాగస్వామిగా ఉన్నాయి.

ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. పేద పిల్లల కోసం ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద పిల్లల ప్రతిభను వెలికి తీయడానికి ఎస్‌టీఎఫ్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు.

సారా టెండూల్కర్ కార్లు (Sara Tendulkar Cars)

తండ్రి బాటలోనే సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి కంకణం కట్టుకున్న సారా టెండూల్కర్ ఖరీదైన కార్లను కూడా ఉపయోగిస్తుంది. సారా ఉపయోగించే కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ ఐ8 (BMW i8), బీఎండబ్ల్యూ ఎం6 (BMW M6) మొదలైనవి ఉన్నాయి.

బీఎండబ్ల్యూ ఐ8

భారతదేశంలోని అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లలో ఐ8 కూడా ఒకటి. ఈ కారు ధర ఇండియన్ మార్కెట్లో రూ. 2.62 కోట్లు (ఎక్స్ షోరూమ్). చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న ఈ కారు 1499 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 357 Bhp పవర్ మరియు 570 Nm టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టం కలిగిన ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ బీఎండబ్ల్యూ ఐ8 (BMW i8) అత్యుత్తమ ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

బీఎండబ్ల్యూ ఎం6

రూ. 1.75 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన బీఎండబ్ల్యూ ఎం6 (BMW M6) కారు కూడా సారా టెండూల్కట్ ఉపయోగిస్తుందని సమాచారం. ఇది 4395 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 560 Bhp పవర్ మరియు 680 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

Also Read: పెళ్లి చేసుకోబోతున్న పీవీ సింధు – ఈమె ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?

నిజానికి ఈ కార్లను సారా టెండూల్కర్ కొనుగోలు చేసిందా? లేక.. తన తండ్రి కార్లను ఉపయోగిస్తోందా? అనే విషయం మీద స్పష్టత లేదు. ఎందుకంటే సచిన్ గ్యారేజిలో లెక్కకు మించిన లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా సచిన్ బీఎండబ్ల్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. ఈ కారణంగానే వీరి గ్యారేజిలో చాలా బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి.

సచిన్ టెండూల్కర్ గ్యారేజిలోని కార్లు (Sachin Tendulkar Car Collection)

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ సీ36 ఏఎంజీ, బీఎండబ్ల్యూ ఎం5 30జహ్రే, బీఎండబ్ల్యూ ఎక్స్5ఎం, బీఎండబ్ల్యూ ఎం6 గ్రాన్ కూపే, బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్ఐ, ఫెరారీ 360 మోడెన, నిస్సాన్ జీటీఆర్ మరియు లంబోర్ఘిని ఉరుస్ వంటి మరెన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ సచిన్ మొట్ట మొదటి కారు మారుతి సుజుకి 800 (Maruti Suzuki 800) అని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఇది మాత్రమే కాకుండా.. ఫియట్ కారు కూడా సచిన్ గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం.

Leave a Comment