Sampoornesh Babu Press Meet Before Sodara Release: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. హృదయ కాలేయం సినిమాతో హీరోగా పరిచయమై ఎంతోమంది హృదయాలను ఆకర్శించిన ఈయన ప్రారంభ జీవితం గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన కష్టాలను చెప్పుకొచ్చాడు.
తెలంగాణలోని సిద్ధిపేట పక్కన మిట్టపల్లి అనే గ్రామంలో ‘నరసింహాచారి’గా (సంపూర్ణేష్ బాబు అసలు పేరు) పుట్టిన సంపూకు ఒక అన్న, ఇద్దరు అక్కలు. తాను పదవ తరగతిలో ఉన్నప్పుడే తండ్రి కన్నుమూశారు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. అన్నకు చేదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి ఉన్న సంపూర్ణేష్ బాబు.. పని చేసుకుంటూనే నటన నేర్చుకున్నాడు.
ఎక్కువగా సినిమాలు చూసే అలవాటున్న సంపూర్ణేష్ బాబు.. ఆ తరువాత పట్టు వదలకుండా ప్రయత్నించి సినిమాల్లో చిన్న చిన్న క్యేరెక్టర్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో స్టీఫెన్ శంకర్ అలియాస్ రాజేష్ అనే దర్శకునితో పరిచయం ఏర్పడింది. రాజేన్గ్ దర్శకత్వలో సంపూర్ణేష్ బాబు.. హీరోగా హృదయ కాలేయం అనే సినిమాలో నటించాడు. ఆలా హీరోగా గుర్తింపు పొందిన సంపూ.. ఆ తరువాత కొబ్బరి మట్ట, క్యాలీఫ్లవర్ వంటి అనేక సినిమాల్లో నటించిన అభిమానుల మెప్పు పొందాడు.
2014 ఏప్రిల్ 4న తెరమీదకు వచ్చిన హృదయ కాలేయం సినిమా 11వ వార్షికోత్సవం సందర్భంగా.. విలేకర్లతో మాట్లాడుతూ చిన్న పల్లెటూరిలో పుట్టిన నన్ను హీరోగా పరిచయం చేసిన రాజేష్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ సినిమా సమయంలో దర్శకధీరుడి రాజమౌళి చేసిన ట్వీట్ వల్ల నాకు ఎంతో గుర్తింపు లభించింది. సందీప్ కిషన్ అన్న, తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా చాలా సపోర్ట్ చేశారు.
బిగ్‌బాస్ సీజన్ 1 నుంచి వచ్చేసాను
నటుడు సంపూర్ణేష్ బాబు.. బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొన్నాడు. అయితే అక్కడ నా జీవితానికి పూర్తగా డిఫరెంట్ ప్రపంచం ఉంది. నాకు అది నచ్చలేదు. సాధారణ జీవితం గడిపే నాకు ఓకే రిచ్ వ్యక్తి మాదిరిగా.. ఒకే ఇంట్లో బంధించి ఉంచినట్లు అనిపించింది. అందుకే ఏడ్చేసాను. జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేసినప్పటికీ అక్కడ ఉండలేకపోయాను. అందుకే బయటకు వచ్చేసాను.
Also Read: మరోమారు వార్తల్లో నిలిచిన నాగచైతన్య: రేసింగ్ కారులో శోభిత
బయటకు వచ్చిన తరువాత.. మంచి అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకున్నావని కొందరు నా మీద సీరియస్ అయ్యారు. ఎందుకు వదిలేసానా.. అని అప్పుడు నాకు బాధేసింది. ఇక చేసేదేమీ లేక ఊరుకున్నాను. అయితే బిగ్‌బాస్ నుంచి వచ్చిన కొంత డబ్బును విరాళంగా ఇచ్చాను. అప్పుడు మనసు కొంత కుదుటపడింది. ఆ సమయంలోనే నేను కారులో అయినా తిరగగలనా అని అనుకున్నాను. కానీ ప్రేక్షకులు, రాజేష్ అన్న ఇప్పుడు నన్ను విమానంలో తిరిగేలా చేశారు.
సంపూర్ణేష్ బాబు సోదరా సినిమా
నటుడు సంపూర్ణేష్ బాబు నటించిన సోదరా సినిమా.. ఈ నెల 25న తెరమీదకు రానుంది. ఈ సినిమా కూడా విజయవంతం కావాలని ఆశిస్తున్నాము. అయితే ఇప్పటికే సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం అనే సినిమాలో మాత్రమే కాకుండా.. కొబరిమట్ట, బజార్ రౌడీ, చెక్ మేట్, హాఫ్ స్టోరీస్, మార్టిన్ లూథర్ కింగ్, క్యాలీఫ్లవర్ అనే సినిమాల్లో కూడా నటించాడు. కాగా ఇప్పుడు సోదరా సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.