Senior Actor Arjun Sarja Daughter Anjana Engaged: భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. అటు సామాన్యులు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా పెళ్లిపీటలెక్కడానికి సిద్దమైపోయారు. ఇప్పటికే నటి అభినయ, బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక పెళ్లి చేసుకున్నారు. ఈ జాబితాలోకి యాక్షన్ స్టార్ అర్జున్ సర్జ చిన్న కుమార్తె అంజనా (Anjana) చేయనున్నారు.
ఇటలీలో ప్రియుడితే ఎంగేజ్మెంట్ చేసుకున్న చేసుకున్న అంజనా.. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ, 13 సంవత్సరాల ప్రేమ అని వెల్లడించారు. ఈమె ఎంగేజ్మెంట్ ఇటలీలో జరిగినట్లు సమాచారం. అర్జున్ ఫ్యామిలీతో సహా తన కూతురు నిశ్చితార్దానికి హాజరయ్యేరు. బహుశా ఈ కార్యక్రమం చాలా తక్కువమందితో జరిగినట్లు తెలుస్తోంది.
ఎంగేజ్మెంట్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అంజనా.. తన ప్రియుడితో కలిసి నడుస్తుంటడం, ఆమె తల్లిదండ్రులు, అక్క బావలు కూడా ఉండటం చూడవచ్చు. 13 ఏళ్ల ప్రేమ.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. అయితే వీరి పెళ్లి ఎప్పుడని అధికారికంగా వెల్లడించలేదు.
అంజనా.. ప్రియుడి ఎవరు?, అతని బ్యాగ్రౌండ్ ఏమిటి అనే వివరాలు వెల్లడించలేదు. బహుశా ఇతనిది భారతదేశం అయితే కాదని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో.. ఇతడెవరు అనే విషయం తెలుస్తుంది. మొత్తానికి ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేయడంతో.. నెటిజన్లు, అర్జున్ సర్జా అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
అంజనా సర్జా గురించి
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా చిన్న కుమార్తె.. అంజనా. 1995 ఏప్రిల్ 21న జన్మించిన ఈమె.. సర్జా బ్యాగ్స్ కంపెనీ ఫౌండర్ మరియు సీఈఓ. సింగపూర్‌లోని లాసెల్లె కాలేజ్ ఆఫ్ ది ఆర్ట్స్ మరియు న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ వంటి వాటిలో చదువుకున్న ఈమె.. ప్రోయెంజా షౌలర్ మరియు ఎలీ వంటి ప్రముఖ ఫ్యాషన్ హౌస్‌లతో పనిచేశారు. కాగా ఇప్పుడు తానే స్వయంగా ఓ ఫ్యాషన్ బ్యాగ్ బ్రాండ్ నడుపుతోంది.
Also Read: ఎనిమిదేళ్ళకు మొదటి బిడ్డకు జన్మనించిన ప్రముఖ నటి: ఫోటోలు చూశారా?
అర్జున్ సర్జా గురించి
తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం మరియు హిందీ సినిమాల్లో నటించారు అర్జున్ సర్జా. ఈయన నటించిన పుట్టింటికి రా చెల్లి సినిమా తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసి.. ఆకట్టుకుంది. శ్రీ ఆంజనేయం, హనుమాన్ జంక్షన్, రామ రామ కృష్ణ కృష్ణ వంటి తెలుగు సినిమాల్లో నటించిన అర్జున్.. 10 కంటే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు, SIIMA అవార్డు వంటివి కూడా ఈయనకు లభించాయి.
ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అర్జున్ 1988లో నటి నివేదితను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమ్మెర్తెలు. ఒకరు ఐశ్వర్య, మరొకరు అంజనా. ఐశ్వర్య హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించింది. అయితే గత ఏడాది ఈమె నటుడు ఉమాపతి రామయ్యను వివాహం చేసుకుంది. కాగా అంజనా ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అర్జున్ సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లయిన తరువాత ఈయన కుమార్తె ఐశ్వర్య కూడా సినిమాల్లో కనిపించడం లేదు. అంజనా మాత్రం వ్యాపారవేత్తగా ముందుకు సాగుతోంది. మొత్తం మీద అర్జున్ ఇంట్లో త్వరలోనే మరోమారు పెళ్లిబాజాలు మోగనున్నాయి.