ప్రముఖ నటి కియారా అద్వానీ 2023 ఫిబ్రవరిలో.. సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గత ఫిబ్రవరి నెలలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొదటి బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇటీవల వారు రెగ్యులర్ చెకప్ చేసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సిద్దార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ.. రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు, అభిమానులు వారిని చుట్టుముట్టారు. ఆ సమయంలో సిద్దార్థ్ మల్హోత్రాకు కొంచెం కోపం వచ్చింది. వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి అంటూ చెప్పారు. ఆ సమయంలో కియారా కారులో కూర్చుని ఉండటం చూడవచ్చు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై.. పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలామంది వారికి మద్దతుగా మాట్లాడారు. వారు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కూడా అభిమానులు వాళ్ళను ఇబ్బంది పెట్టడం సరైనపద్ధతి కాదు. వారికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టయోటా వెల్‌ఫైర్
ఇక కియారా అద్వానీ కూర్చున్న కారు విషయానికి వస్తే.. దీనిని సిద్దార్థ్ మల్హోత్రా గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రెగ్నెన్సీ సమయంలో కియారాకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని.. ప్రత్యేకంగా దీనిని కొనుగోలు చేశారు. ఇక్కడ కనిపించే కారు టయోటా కంపెనీ యొక్క వెల్‌ఫైర్ అని తెలుస్తోంది. ప్రెషియస్ మెటల్ రంగులో ఉన్న ఈ కారు చాలావరకు లగ్జరీ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ అని తెలుస్తోంది.
టయోటా వెల్‌ఫైర్ మంచి హెడ్‌ల్యాంప్ మరియు పెద్ద ఫ్రంట్ గ్రిల్ పొందుతుంది. ఈ కారు 4995 మిమీ పొడవు, 1850 మిమీ వెడల్పు, 1950 మిమీ ఎత్తు మరియు 3000 మిమీ వీల్‌బేస్ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. వెల్‌ఫైర్ దిగువన విండో లైన్‌లో ఒక మలుపు ఉండటం చూడవచ్చు. పిల్లర్స్ అన్నీ కూడా నలుపు రంగులో ఉన్నాయి. క్రోమ్ గార్నిష్‌లు కూడా ఉండటం గమనించవచ్చు. 19 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు ఎల్ఈడీ బార్‌తో కూడిన ఎల్ఈడీ టెయిల్ లాంప్ పొందుతుంది.
ఇంటీరియర్ మరియు ఇంజిన్ వివరాలు
సిద్దార్థ్ మల్హోత్రా కొనుగోలు చేసిన టయోటా వెల్‌ఫైర్ కారు లేత గోధుమరంగు ఇంటీరియర్ కలిగి ఉంటుంది. కాబట్టి క్యాబిన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ అండ్ హీటెడ్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ఏడీఏఎస్ ఫీచర్స్ మొదలైనవి ఉన్నాయి. అంతే కాకుండా రెండవ, మూడవ వరుస ప్రయాణికులకు ఎలక్ట్రిక్ విండో కర్టెన్స్ ఉన్నాయి. వెనుక రెండు కెప్టెన్ సీట్లు, రూఫ్ మౌంటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటివాటితో పాటు.. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్స్ కూడా పొందుతాయి.
టయోటా వెల్‌ఫైర్ 2.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇంజిన్ 193 పీఎస్ పవర్, 240 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.
Also Read: బర్త్‌డేకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన భార్య – ఆనందంతో తేలిపోయిన భర్త (వీడియో)
వెల్‌ఫైర్ లగ్జరీ కారును టయోటా రెండు వేరియంట్లలో అందిస్తోంది. ఒకటి హాయ్ వేరియంట్ (రూ.1.22 కోట్లు), లాంచ్ ఫ్యాకేజీతో కూడిన వీఐపీ వేరియంట్ (రూ. 1.32 కోట్లు). ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే.. ఆన్ రోడ్ ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అయితే సిద్దార్థ్ మల్హోత్రా కొనుగోలు చేసిన కారు లాంజ్ వేరియంట్ అని తెలుస్తోంది. దీని ధర బహుసార్ రూ. 2 కోట్లు వరకు ఉండొచ్చని భావిస్తున్నాము.
టయోటా వెల్‌ఫైర్ కారు కలిగిన ఇతర సెలబ్రిటీలు
నిజానికి చాలామంది సెలబ్రిటీల దగ్గర ఈ టయోటా వెల్‌ఫైర్ కారు ఉంది. ఇప్పటికే రిషబ్ శెట్టి, అక్షయ్ కుమార్, ఐశ్వర్యారాయ్, అనిల్ కపూర్, అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, రాకేష్ రోషన్, మలయాళ నటుడు మోహన్ లాల మరియు ఫహిద్ ఫాసిల్ మొదలైనవారు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సిద్దార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ కూడా చేరిపోయారు.