ఎట్టకేలకు మార్కెట్లో అడుగుపెట్టిన ‘స్కోడా కైలాక్’: రేటు తెలిస్తే.. ఇప్పుడే కొనేస్తారు!

SKoda Kylaq India Launched: పండుగ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా కంపెనీలు కార్లను, బైకులను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. అయితే దసరా, దీపావళి పండుగల అయిపోయిన తరువాత కూడా స్కోడా కంపెనీ ఓ కొత్త కారును అధికారికంగా భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. స్కోడా లాంచ్ చేసిన కొత్త కారు పేరు ‘కైలాక్’ (Kylaq). ఈ లేటెస్ట్ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. వచ్చేయండి.

కైలాక్ ధరలు

మార్కెట్లో అడుగుపెట్టిన కైలాక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కారు కోసం వచ్చే నెల 2 నుంచి (డిసెంబర్ 2) నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. డెలివరీలు 2025 జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయి. అంతకంటే ముందు స్కోడా ఈ కారును 2025 జనవరి 17న భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో కూడా ప్రదర్శించనుంది.

కైలాక్ డిజైన్

లేటెస్ట్ సాలిడ్ డిజైన్ కలిగిన మొట్ట మొదటి స్కోడా కారు కైలాక్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. ఫాసియా స్లిమ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ విస్తరించి ఉంటుంది. సీతాకోక చిలుక మాదిరిగా ఉండే గ్రిల్‌ను కూడా ఇక్కడ చూడవచ్చు. హెడ్‌ల్యాంప్ అనేది దాని కింద ఉంటుంది. బంపర్ సెంట్రల్ ఎయిర్ వెంట్స్ మరియు బేస్ వద్ద ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఎలిమెంట్‌ను కలిగి ఉంటుంది. డ్యూయెల్ టోన్ ఇక్కడా గమనించవచ్చు.

రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ బ్లాక్ ట్రిమ్ స్ట్రిప్‌తో అనుసంధానించబడిన సరళంగా కనిపించే చతురస్రాకార టెయిల్‌ల్యాంప్‌లను చూడవచ్చు. వెనుక బంపర్‌లో క్లాడింగ్ మరియు స్కిడ్ ప్లేట్ ఎలిమెంట్ వంటివి ఉన్నాయి.మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉన్నట్లు చూడగానే అర్థమైపోతుంది.

కైలాక్ ఫీచర్స్

స్కోడా కైలాక్ 10 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, టూ స్పోక్ స్టీరింగ్, రెండు చివర్లలో నిలువగా ఉన్న వెంట్స్ వంటివన్నీ బ్రాండ్ యొక్క కుషాక్ కారును తలపిస్తాయి. పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవన్నీ ఉన్నాయి.

డైమెన్షన్స్ (కొలతలు)

కొత్త స్కోడా కైలాక్ యొక్క పరిమాణం విషయానికి వస్తే.. ఈ కారు పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,783 మిమీ, ఎత్తు 1619 మిమీ మరియు వీల్‌బేస్ 2,566 మిమీ వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 189 మిమీ కాగా.. బూట్ స్పేస్ 446 లీటర్ల వరకు ఉంది. కాబట్టి ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.

కైలాక్ ఇంజిన్ వివరాలు

స్కోడా కైలాక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.0 లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 114 Bhp పవర్ మరియు 178 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

కైలాక్ ప్రత్యర్థులు

స్కోడా కైలాక్ దేశీయ మార్కెట్లో.. అమ్మకానికి ఉన్న మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, టాటా నెక్సాన్, హ్యుండై వెన్యూ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. అయితే స్కోడా కైలాక్ అనేది ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్, సరికొత్త డిజైన్ మరియు తక్కువ ధర కలిగి ఉండటం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

Don’t Miss: మార్కెట్లో సరికొత్త డిజైర్: రూ. 11వేలకే బుకింగ్స్
భారతీయ మార్కెట్లో విక్రయానికి ఉన్న స్కోడా కార్లు

ఇండియన్ మార్కెట్లో స్కోడా కంపెనీ కుషాక్, స్లావియా, కొడియాక్ మరియు సూపర్బ్ వంటి కార్లను విక్రయిస్తోంది. ఇప్పుడు తాజాగా కైలాక్ కూడా చేరింది. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న స్కోడా కొత్త కైలాక్ లాంచ్ చేయడంతో తప్పకుండా మరింతమంది కస్టమర్లను ఆకర్శించే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం బుకింగ్స్ ప్రారంభమైన తరువాత తెలిసిపోతుంది.