Skoda Slavia Monte Carlo and Kushaq Sportline Launched in India: చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ ‘స్కోడా’ (Skoda) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ స్లావియా, కుషాక్ వంటి కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అంతే కాకుండా ఈ సంస్థ ఇప్పుడు మరో రెండు కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. అవి ‘స్కోడా స్లావియా మోంటే కార్లో’ (Skoda Slavia Monte Carlo) మరియు స్కోడా కుషాక్ స్పోర్ట్‌లైన్ (Skoda Kushaq Sportline).
స్కోడా స్లావియా మోంటే కార్లో (Skoda Slavia Monte Carlo)
దేశీయ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలతో దూసుకెళ్తున్న స్కోడా స్లావియా కారును కంపెనీ ఇప్పుడు ‘మోంటే కార్లో’ పేరుతో లాంచ్ చేసింది. ఈ సెడాన్ ప్రారంభ ధరలు రూ. 15.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారును బుక్ చేసుకున్న మొదటి 5,000 మంది రూ. 30,000 ప్రయోజనాలు పొందవచ్చు. ఈ అవకాశం సెప్టెంబర్ 6వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
స్కోడా స్లావియా మోంటే కార్లో మోడల్ అనేది స్టాండర్డ్ మోడల్ యొక్క టాప్ స్పెక్ ట్రిమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది చూడటానికి సాధారణ స్లావియా మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ చూడవచ్చు. గ్రిల్, బ్యాడ్జ్, డోర్ హ్యాండిల్స్, సైడ్ స్కర్ట్స్, రియర్ స్పాయిలర్, బంపర్ మీద బ్లాక్ కలర్ హైలెట్స్ అన్నీ కూడా దీని కొత్త వేరియంట్ అని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఈ సెడాన్ బ్లాక్ కలర్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.
స్లావియా మోంటే కార్లో ఎడిషన్ లోపల రెడ్, బ్లాక్ కలర్ థీమ్ పొందుతుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా రెడ్ కలర్ థీమ్ పొందుతుంది. ఇందులో అల్యుమియం పెడల్స్ చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో పవర్ సన్‌రూఫ్, 8 స్పీకర్ ఆడియో సిస్టం, ఫ్రంట్ వెంటిలేషన్ సీట్లు, 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉంటాయి.
ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. స్కోడా స్లావియా మోంటే కార్లో ఎడిషన్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 115 హార్స్ పవర్ మరియు 150 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి రెండూ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే మంచి పర్ఫామెన్స్ అందిస్తుందని భావిస్తున్నాము.
స్కోడా కుషాక్ స్పోర్ట్‌లైన్ (Skoda Kushaq Sportline)
ఇక స్కోడా కుషాక్ స్పోర్ట్‌లైన్ విషయానికి వస్తే.. ఇది మిడ్‌సైజ్ ఎస్‌యూవీ. దీని ధరలు రూ. 14.70 లక్షల నుంచి రూ. 17.40 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. అక్కడక్కడా బ్లాక్ కలర్ ట్రీట్‌మెంట్ పొందిన ఈ కారు మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది.
స్కోడా కుషాక్ స్పోర్ట్‌లైన్ బ్లాక్ గ్రిల్ సరౌండ్, రియర్ స్కఫ్ ప్లేట్స్, బ్లాక్ అవుట్ రూఫ్, రూఫ్ రెయిల్స్ మరియు బ్లాక్ విండో లైన్, టెయిల్‌గేట్ గార్నిష్‌లు పొందుతుంది. ఇవన్నీ చూడటానికి కుషాక్ మోంటే కార్లో మాదిరిగా ఉంటాయి. అంతే కాకుండా బ్లాక్ డోర్ గార్నిష్, 17 ఇంచెస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫెండర్ మీద స్పోర్ట్‌లైన్ బ్యాడ్జ్ వంటివి ఇందులో చూడవచ్చు.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది డ్యూయెల్ టోన్ కలర్ పొందుతుంది. ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి మరెన్నో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.
Don’t Miss: పండుగ సీజన్‌లో పండుగలాంటి వార్త!.. భారీగా తగ్గిన ధరలు
కొత్త స్కోడా కుషాక్ స్పోర్ట్‌లైన్ మోడల్ 115 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 150 హార్స్ పవర్ & 250 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. ఇవి రెండూ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. మూడో ఇంజిన్ 1.5 లీటర్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది. మొత్తం మీద అన్ని వేరియంట్స్ ఉత్తమ పనితీరును అందిస్తాయని ఆశిస్తున్నాము.