Super Rich And Famous People Favorite Tata Cars: ధనవంతులు లేదా సినీ ప్రముఖులు అనగానే.. వీరంతా ఖరీదైన కార్లను వినియోగిస్తారని అనుకుంటారు. ఎవరెన్ని కార్లను ఉపయోగించినా టాటా కార్లకు కూడా ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఓ ఆదరణ ఉంది. ఈ కారణంగానే చాలామంది తమ గ్యారేజిలో లేదా రోజువారీ వినియోగానికి మేడ్ ఇన్ ఇండియా టాటా కార్లను ఉపయోగిస్తున్నారు. ఇంతకీ టాటా కార్లను ఉపయోగిస్తున్న ప్రముఖులెవరు? వారు ఉపయోగిస్తున్న కార్లు ఏవి అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రాజేష్ హీరానందని
బిలినీయర్ రాజేష్ రాజేష్ హీరానందని ఉపయోగించే టాటా బ్రాండ్ కారు ‘నానో’ అని తెలిస్తే.. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయినా మీరు విన్నది నిజమే. ఎరుపు రంగులో కనిపించే టాటా నానో కారులో రాజేష్ హీరానందని చాలాసార్లు కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మోతీలాల్ ఓస్వాల్
ప్రముఖ బిలినీయర్ మరియు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ బాస్.. మోతీలాల్ ఓస్వాల్ ఉపయోగించే టాటా కారు సఫారీ డార్క్ ఎడిషన్. దీని ధర రూ. 27.24 లక్షలు. ఈ కారును డీలర్షిప్ అధికారులు నేరుగా ఆయన నివాసానికి డెలివరీ చేశారు. మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఈ కారు 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టైల్‌లైట్స్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ పొందుతుంది.
కిమ్ శర్మ
టాటా కారును కలిగి ఉన్న సినీ తారలతో ఒకరు కిమ్ శర్మ. ఈమె కూడా టాటా నానో కారును కలిగి ఉంది. ఉదయం జిమ్‌కు వెళ్లే సమయంలో ఈమె తరచుగా నానో కారులోనే కనిపిస్తుంటారు. భారతదేశంలో అత్యంత చౌకైన కారుగా, రతన్ టాటా ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఈ కారు ఒకప్పుడు ఎంతోమంది మనసు దోచింది. ఈ కారు కాకుండా కిమ్ శర్మ రూ. 2 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ సెడాన్‌ను కూడా కలిగి ఉంది.
ఎన్ చంద్రశేఖరన్
టాటా సన్స్ మరియు టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా రెండు టాటా నెక్సాన్ ఈవీ కారును కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు టాటా కార్ల మీద ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. 2020లో టాటా మోటార్స్ 50,000 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసిన సందర్భంగా రెండో నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. నెక్సాన్ ఈవీ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.19 లక్షల మధ్య ఉంది.
శ్రీధర్ వెంబు
జోహో కార్పొరేషన్ ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీధర్ వెంబు 2022లో టాటా నెక్సాన్ ఈవీ కొనుగోలు చేశారు. వైట్ రూఫ్, టీల్ బ్లూ కలర్ ఆప్షన్ కలిగిన ఈ కారు చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాకుండా.. ఈయనకు ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కూడా ఉంది. చిన్న దూరాలకు ప్రయాణించడానికి ఈ ఎలక్ట్రిక్ ఆటో ఉపయోగిస్తారని సమాచారం. ఈయనకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం మీద మక్కువ ఎక్కువ.
మాధురీ దీక్షిత్
ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కూడా టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ ఈవీ కొనుగోలు చేసింది. మాధురీ దీక్షిత్ మాత్రమే కాకుండా.. ఈమె భర్త శ్రీరామ్ నేనే కూడా టాటా నెక్సాన్ ఈవీ కొనుగోలు చేసినట్లు సమాచారం. వీరు 2022లో నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ కొనుగోలు చేశారు. ఈ కారును శ్రీరామ్ నేనే ఆఫీసుకే డెలివరీ చేశారు. మాధురీ దీక్షిత్ కార్ల గ్యారేజిలో నెక్సాన్ మాత్రమే కాకుండా.. ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్డబ్ల్యుబీ హెచ్ఎస్ఈ కూడా ఉంది.
ఫాతిమా సనా షేక్
టాటా బ్రాండ్ కారును కలిగి ఉన్న మరో బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్. దంగల్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు టాటా హారియార్ ఫ్రీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ యొక్క డార్క్ ఎడిషన్ కొనుగోలు చేసింది. ఈ కారు మాత్రమే కాకుండా.. ఈమె గ్యారేజిలో రూ. 1.15 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కారు కూడా ఉంది.
పంకజ్ త్రిపాఠి
ప్రముఖ నటుడు పంకజ్ తివారీ గ్యారేజిలో టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ ఈవీ ఉంది. చాలా సందర్భాల్లో ఈమె ఈ కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు.ఈయన వద్ద ఉన్న టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎడిషన్. ఇది ఒక ఫుల్ చార్జితో 465 కిమీ రేంజ్ అందిస్తుంది. చూడటానికి సాధారణ నెక్సాన్ ఈవీ మాదిరిగా ఉన్నప్పటికీ.. దీనిని కంపెనీ ఎక్కువ రేంజ్ అందించేలా రూపొందించింది.
Don’t Miss: రూ.4.5 లక్షల స్కూటర్ కొన్న మొదటి వ్యక్తి ఇతడే..
పైన చెప్పుకున్న ప్రముఖులతో పాటు.. దేశీయ పారిశ్రామిక దిగ్గజం, భారత మాత ముద్దుబిడ్డ రతన్ టాటా కూడా టాటా నానో కారునే ఎక్కువగా ఉపయోగించేవారు. బుల్లితెర నటి ఉల్కా గుప్తా (టాటా నెక్సాన్ ఈవీ), సినీ నటి మందిరా బేడీ (టాటా నెక్సాన్ ఈవీ), అనిల్ కపూర్ (టాటా సఫారీ), జాయ్ లెనో (టాటా నానో) వంటి వారు కూడా టాటా కార్లను కూడా కలిగి ఉన్నారు.