Tata Motors June 2024 Discounts: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) 2024 జూన్ నెలలో కొన్ని ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ జాబితాలో టాటా టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ మరియు పంచ్ ఈవీ ఉన్నాయి. ఈ నెలలో ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది కొనుగోలు చేసిన డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్స్ వంటివి లభిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)
టియాగో ఈవీ కొనుగోలు మీద కంపెనీ ఈ నెలలో రూ. 95000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. లాంగ్ రేంజ్ ఈవీ వేరియంట్ కొనుగోలుపైన రూ. 75000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. గత నెలలో కంపెనీ ఇదే కారు మీద రూ. 52000 నుంచి రూ. 60000 వరకు తగ్గింపులను అందించింది.
దేశీయ మార్కెట్లో టాటా టియాగో ఈవీ ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.89 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు భారతీయ విఫణిలో అత్యుత్తమ అమ్మకాలు పొందిన వాహనాల జాబితాలో ఒకటిగా ఉంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు పనితీరు పరంగా కూడా అద్భుతంగా ఉంది. ఈ కారణంగానే ఎక్కువ మంది ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.
టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)
భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న ‘టాటా నెక్సాన్ ఈవీ’ కొనుగోలు మీద కస్టమర్ ఏకంగా రూ. 1.35 లక్షల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. 2024 నెక్సాన్ ఈవీ క్రియేటివ్ ప్లస్ ఎంఆర్ వేరియంట్ మీద రూ. 85000 వరకు తగ్గింపు లభిస్తుంది.
దేశీయ విఫణిలో నెక్సాన్ ఈవీ ధరలు రూ. 14.49 లక్షల నుంచి రూ. 19.49 లక్షల మధ్య ఉంది. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికి కూడా ఈ కారు అత్యుత్తమ అమ్మకాలను పొందుతూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ కారును కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంత ఆసక్తి చూపుతున్నారో ఇట్టే అర్థమవుతోంది.
నెక్సాన్ ఈవీ మిడ్ రేంజ్ వెర్షన్ 30 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 325 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. కాగా నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ మోడల్ 40.5 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక సింగిల్ చార్జితో 465 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో.. వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా కొంత తగ్గే అవకాశం ఉంది.
టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)
భారతదేశంలో సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన మైక్రో SUV టాటా పంచ్.. ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు కొనుగోలు మీద కస్టమర్ కేవలం రూ. 10000 విలువైన ప్రయోజనాలను మాత్రమే పొందగలడు. ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 25 కిలోవాట్ యూనిట్, మరొకటి 35 కిలోవాట్ యూనిట్. ఇవి రెండూ 315 కిమీ (25 kWh) మరియు 421 కిమీ (35 kWh) రేంజ్ అందిస్తాయి.
అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన టాటా పంచ్ ఈవీ ధరలు దేశీయ విఫణిలో రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. టాటా పంచ్ ఈవీ కూడా మార్కెట్లో కూడా మంచి అమ్మకాలు పొందుతున్న ఉత్తమ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
Don’t Miss: నితిన్ గడ్కరీ కార్ కలెక్షన్.. ఇలాంటి కార్లు మరెవ్వరి దగ్గరా లేదు!
గమనిక: టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల మీద అందిస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత బహుశా అందుబాటులో ఉండకపోవచ్చు. అంతే కాకుండా డిస్కౌంట్స్ అనేవి ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. కాబట్టి కస్టమర్లు కచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి.