Today Gold and Silver Price in India: అమెరికా ప్రెసిడెంట్ సుంకాల ప్రభావం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో.. గోల్డ్ రేటు మాత్రం రోజురోజుకు తగ్గుతూనే ఉంది. ఏప్రిల్ 4 నుంచి ఈ రోజు (ఏప్రిల్ 8) వరకు పసిడి ధరలు గరిష్టంగా రూ. 3650 (10 గ్రా) తగ్గింది. దీంతో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది.
హైదరాబాద్ మరియు విజయవాడలలో 22 క్యారెట్ 10 గ్రా గోల్డ్ రేటు రూ. 82,250 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రా బంగారం ధర రూ. 89,730 వద్దకు చేరింది. గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై మరియు చెన్నై నగరాల్లోని బంగారం ధరలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విధంగానే ఉంటాయి. బంగారం ధరలు తగ్గడం వరుసగా ఇది నాలుగవ రోజు కావడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు అమాంతం తగ్గింది. దేశ రాజధాని నగరంలో 10 గ్రామ్స్ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 82,400 కాగా.. 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 89,880 వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో బంగారం ధరలు కొంత ఎక్కువగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
వెండి ధరలు: దేశంలో సిల్వర్ రేటు మాత్రం గత మూడు రోజులుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు.. ఉలుకు పలుకు లేకుండా నిశ్చలంగా ఉంది. దీంతో దేశంలో వెండి ధరలు పెరగలేదు. గైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ముంబై, చెన్నై మరియు బెంగళూరు ప్రాంతాల్లో కేజీ వెండి రేటు రూ. 10,3000 వద్ద ఉంది. అంటే ఈ నగరాల్లో ఒక గ్రామ్ సిల్వర్ రేటు 103 రూపాయలు వద్ద ఉంది. ఢిల్లీలో కూడా వెండి ధరలు పెరగలేదు. అయితే దేశంలోని ఇతర నగరాల కంటే ఇక్కడ వెండి ధరలు (కేజీ రేటు రూ. 94000) కొంత తక్కువగా ఉన్నాయి.
ధరలు తగ్గడానికి కారణం
నిజానికి మార్చి నెల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. ఏప్రిల్ ప్రారంభంలో కూడా ఏ మాత్రం తగ్గలేదు. గత ఐదు రోజులుగా మాత్రమే బంగారం ధరలు పెరగలేదు. కాబట్టి ధరలు తగ్గుతూనే ఉంది. గోల్డ్ రేటు తగ్గడానికి కారణం.. అమెరికా టారిఫ్ భయమే అని తెలుస్తోంది.
Also Read: గోల్డ్ రేటు ఎవరు నిర్ణయిస్తారో తెలుసా?
డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను పెంచిన తరువాత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా కుప్పకూలాయి. పెట్టుబడిదారులు లక్షల కోట్లు నష్టపోయారు. దీంతో ప్రస్తుతం పెట్టుబడిదారులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా.. ఒకింత ఆలోచిస్తున్నారు. కొంతమంది ఎక్కడా పెట్టుబడులు పెట్టకుండా ఉండిపోగుతున్నారు. ఓ వైపు పడిపోతున్న స్టాక్ మార్కెట్లు, మరోవైపు క్రిప్టో కరెన్సీ.. వీటివల్ల పెట్టుబడిదారుడు భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కాబట్టి బంగారం మీద కూడా పెట్టుబడి పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు.
అమెరికా ప్రతీకార సుంకాలను ధీటుగా.. చైనా కూడా అమెరికా మీద సుంకాలను ప్రకటించింది. ఇది గోల్డ్ రేటు తగ్గడానికి ప్రధాన కారణమని నిపుణులు, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గోల్డ్ రేటు ఇంకా కొన్ని రోజులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే నిజమైతే పసిడి కొనుగోలుదారులకు పండగే అని చెప్పాలి.