Do You Know Who Decides The Gold Rate in India: భారతదేశంలో బంగారం ధరలు (Gold Price) ఓ రోజు పెరుగుతాయి, మరో రోజు తగ్గుతాయి. ఇంతకీ బంగారం ధరలు ఎందుకు తగ్గుతాయి ఎందుకు పెరుగుతాయి? ఈ ధరలను ఎవరు నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయిస్తారు?.. అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మన దేశంలో బంగారం కొనేవాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గోల్డ్ రేటు తారాస్థాయికి చేరింది. ఇక పసిడి ధరలను ఎవరు నిర్ణయిస్తారు? అనే విషయానికి వస్తే.. ‘ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్’ (IBJA) అనే సంస్థ భారతదేశం బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ఐబీజేఏ అనేది దేశంలోని అతిపెద్ద బంగారు డీలర్లతో ఏర్పడిన సంస్థ. వీరి సారథ్యంలోనే బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదల అనేది నిర్ణయించబడుతుంది.
బంగారం ధరలను ఎలా నిర్ణయిస్తారంటే?
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్.. బంగారం డీలర్లతో మాట్లుతుంది. డీలర్ల కొనుగోలు, అమ్మకాల వంటి వాటిని బేరీజు వేసుకుంటుంది. అంతే కాకుండా.. స్థానిక పన్నులు, దిగుమతి సుంకాలు.. కరెన్సీ హెచ్చు తగ్గులను చూసుకుని ఐబీజేఏ ధరలను నిర్ణయిస్తుంది. ఇదే ధరలు దేశం మొత్తం మీద వర్తిస్తాయి. ఆంటే ఆ ధరలకే బంగారం విక్రయాలు జరుగుతాయి.
బంగారం ధరల ప్రకటనలు అనధికారికంగానే ఉంటాయి. ఎందుకంటే పన్నులు మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. దేశ ఆర్ధిక పరిస్థితులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి. సరఫరా డిమాండ్, దిగుమతి రేటు, రూపాయి మారకం విలువ, బంగారం ఉత్పత్తి, ఉత్పత్తికి అయ్యే ఖర్చు మరియు వడ్డీ రేట్లు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
గోల్డ్ రేటును లెక్కించే ఫార్ములా ఇదే
బంగారం మన దేశంలో బంగారాన్ని 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ మరియు 18 క్యారెట్స్ అనే మూడు విధాలుగా విభజిస్తారు. అయితే 24 క్యారెట్స్ గోల్డ్ అనేది బిస్కెట్స్ లేదా కడ్డీల రూపంలో.. ముడి పదార్థంగా లభిస్తుంది. 22 క్యారెట్స్ మరియు 18 క్యారెట్స్ గోల్డ్ ఆభరణాల రూపంలో లభిస్తుంది. దేశంలో ఎక్కువమంది 22 క్యారెట్స్ బంగారాన్నే కొనుగోలు చేస్తారు. 18 క్యారెట్స్ గోల్డ్ కొనేవాళ్ళ సంఖ్య కూడా కొంత వరుకు ఉంది.
పసిడి స్వచ్ఛతను బట్టి రెండు రకాలుగా లెక్కించవచ్చు. అవి ”స్వచ్ఛత శాతం: బంగారం విలువ = బంగారం రేటు x స్వచ్ఛత x బరువు / 24” & రెండో పద్ధతి ”క్యారెట్స్ విధానం: బంగారం విలువ = బంగారం రేటు x స్వచ్ఛత x బరువు / 100”
ఈ రోజు బంగారం ధరలు (Today Gold Price)
బంగారం ధరలు ఈ రోజు (గురువారం) కూడా పెరుగుదల దిశగానే అడుగులు వేసాయి. దీంతో గోల్డ్ రేటులో స్వల్ప మార్పులు జరిగాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు మరియు చెన్నై వంటి నగరాల్లో బంగారం ధరలు ఒకలా ఉంటే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది.
ఫిబ్రవరి 6న విజయవాడ, హైదరాబాద్, ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాల్లో 24 క్యారెట్ల ధర రూ. 86,510 (10 గ్రా) వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 79,300 (10 గ్రా) వద్ద ఉన్నాయి. ఈ రోజు బంగారం ధరలు వరుసగా రూ. 250 మరియు రూ. 270 పెరిగినట్లు స్పష్టమవుతోంది. చెన్నైలో కూడా పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే రూ. 86510 (24 క్యారెట్స్ 10 గ్రా), రూ. 79300 (22 క్యారెట్స్ 10 గ్రా) వద్ద ఉన్నాయి. ఈ నగరం కూడా గోల్డ్ రేటు రూ. 250 మరియు 270 రూపాయలు పెరిగిందని తెలుస్తోంది.
Also Read: గర్ల్‌ఫ్రెండ్ ఐడియా.. వారానికే రూ. 40వేలు సంపాదన: వైరల్ వీడియో
ఢిల్లీ నగరంలో గోల్డ్ రేటు.. దేశంలోని ఇతర నగరాల కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 86,660 (తులం) వద్ద, 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 79,450 (10 గ్రా) వద్ద ఉన్నాయి. ఈ ధరలు ఫిబ్రవరి 5 కంటే వరుసగా రూ. 250 మరియు రూ. 270 ఎక్కువని తెలుస్తోంది.