మహేష్ బాబు ఫస్ట్ బైక్ ఏదో తెలుసా? ఎవరూ ఊహించలేరు!

Do You Know About Mahesh Babu First Bike TVS 50: 1975 ఆగష్టు 9న జన్మించిన ఘట్టమనేని మహేష్ బాబు (Mahesh Babu).. తన నాలుగే ఏట 1979లో ‘నీడ’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. 1999లో రాజకుమారుడు సినిమాలో ప్రధాన నటుడుగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఆ తరువాత అనేక బ్లాక్ బ్లస్టర్ సినిమాల్లో నటిస్తూ సంచలన విజయాలకు తన ఖాతాలో వేసుకున్న ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎంబీ29’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం దేశంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల జాబితాలో ఒకరుగా ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం కోట్ల రూపాయల విలువ చేసే ఎన్నో ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈయన చదువుకునే రోజుల్లోనే అనేక స్టంట్స్ చేసినట్లు పలు సందర్భాల్లో తానె స్వయంగా చెప్పుకున్నారు. మహేష్ బాబు చిన్నప్పుడు ఎలాంటి బైక్ వాడేవారో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు.

సూపర్ స్టార్ మహేష్ బాబు 11 ఏళ్ల వయసులోనే టూ వీలర్ నడపడం మొదలుపెట్టాడు. ఈయన వాడిన మొదటి టూ-వీలర్ ఏదని తెలిస్తే చాలామంది తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ ద్విచక్ర వాహనం ఏదంటే ‘టీవీఎస్ 50’ (TVS 50). బహుశా ఇది చాలామంది నమ్మకపోవచ్చు. కానీ మహేష్ బాబు పలు ఇంటర్వ్యూలలో స్వయంగా వెల్లసిస్తూ.. నేను చిన్నప్పుడు టీవీఎస్ 50 నడిపానని చెప్పుకొచ్చారు.

టీవీఎస్ 50 (TVS 50)

నేడు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క మొట్ట మొదటి మోపెడ్ టీవీఎస్ 50. దీనిని సంస్థ 1980లో ప్రారంభించింది. ఇది దేశంలోని మొట్ట మొదటి టూ సీటర్ మోపెడ్ బైక్. టీవీఎస్ 50 హోసూర్‌లోని తయారీ కర్మాగారంలో రూపొందించబడింది. ఇది అప్పట్లోనే మార్కెట్లో సంచనల అమ్మకాలు పొంది ప్రజలకు ఇష్టమైన ద్విచక్ర వాహనంగా మారింది.

1980 ప్రాంతంలో టీవీఎస్ 50 ధర రూ. 5000 అని తెలుస్తోంది. 50 సీసీ ఇంజిన్ కలిగిన ఈ టూవీలర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందింది. అప్పట్లో ఇది బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్లలో మాత్రమే లభించేది. సింపుల్ డిజైన్ కలిగి, తేలికగా ఉన్న ఈ టూవీలర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉండేది. దీని టాప్ స్పీడ్ గంటకు 20 కిమీ మాత్రమే అని సమాచారం.

స్టీల్ చాసిస్ కలిగిన టీవీఎస్ 50.. డ్రమ్ బ్రేక్స్ పొందింది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ బైక్ ముందు భాగంలో కన్వెన్షనల్ షాక్ అబ్జార్బర్ మరియు వెనుక డ్యూయెల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. ఈ బైక్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో 2.25/16 4పీఆర్ సెక్షన్ టైర్లు ఉండేవి. కేవలం 3 నుంచి 4 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీ కలిగిన టీవీఎస్ 50 మొత్తం బరువు 70 కేజీలు మాత్రమే.

టీవీఎస్ 50 మోపెడ్ ముందు భావంలో హాలోజన్ హెడ్‌ల్యాంప్, వెనుక కూడా హాలోజన్ లైట్ ఉండేది. అనలాగ్ డిస్‌ప్లే కలిగిన ఈ బైక్ స్పీడో మీటర్ మరియు ఓడోమీటర్ పొందింది. సింగిల్ పీస్ సీట్ ఇద్దరు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. వెనుక గ్రాబ్ రైల్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉండేది.

Don’t Miss: రాజకుమారుడు ‘మహేష్ బాబు’ గ్యారేజిలోని కార్లు ఇవే: రేంజ్ రోవర్, లంబోర్ఘిని, ఆడి ఇంకా..

ఇప్పుడు కూడా ఇండియన్ రోడ్ల మీద అక్కడక్కడా టీవీఎస్ 50 మోపెడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇదే తరువాత కాలంలో కొంత రూపాంతరం చెంది ఎక్స్ఎల్100, హెవీ డ్యూటీ పేర్లతో మార్కెట్లో అమ్మకానికి వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అప్పుడప్పుడు టీవీఎస్ 50లు కనిపిస్తుంటారు. కొత్త టూ వీలర్స్ రాకతో వీటికి ఉన్న ఆదరణ తగ్గిపోవడంతో.. కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో టీవీఎస్ 50 మోపెడ్ కాలగర్భంలో కలిసిపోతోంది.

ఇప్పుడు మహేష్ బాబు ఉపయోగించే కార్లు

ప్రస్తుతం మహేష్ బాబు ఉపయోగించే కార్ల జాబితాలో ఆడి, రేంజ్ రోవర్, బెంజ్, లంబోర్ఘిని, బీఎండబ్ల్యూ మరియు టయోటా బ్రాండ్ కార్లు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఓ ప్రత్యేకమైన కారావ్యాన్ కూడా మహేష్ బాబు ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ అన్యదేశ్య కార్లు కాబట్టి ధరలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి.