Top 5 Cars Under Rs.10 Lakh in Indian Market: పండుగ సీజన్ వచ్చేస్తోంది. కొత్త కారు కొనాలనుకునే వారు ఈ తరుణం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. వర్షాకాలంలో పుట్టుకొచ్చిన పుట్టగొడుగుల్లా కార్లు, బైకులు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఎన్ని కార్లు, ఎన్ని బైకులు దేశీయ విఫణిలో అడుగుపెట్టయినా.. సరసమైన కార్లను కొనుగోలు చేయడానికే చాలామంది ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే అత్యుత్తమ కార్లు గురించి వివరంగా తెలుసుకుందాం..
హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్శించడానికి ఆధునిక వాహనాలను ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ గత ఏడాది ఎక్స్‌టర్ కారును లాంచ్ చేసింది. ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నగా ఉన్నప్పటికీ.. ఆధునిక కాలంలో వాహనదారులు వినియోగానికి కావలసిన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది.
దేశీయ విఫణిలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కార్ల జాబితాలో హ్యుందాయ్ యొక్క ఎక్స్‌టర్ కూడా చెప్పుకోదగ్గ మోడల్. దీని ప్రారంభ ధర రూ. 6.13 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధరలు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్ వంటి వాటికి లోనై ఉంటాయి. కాబట్టి నగరాన్ని బట్టి కూడా ధరలలో మార్పు ఉంటుంది. ఎక్స్‌టర్ కారు అత్యాధునిక డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఎక్స్‌టర్ ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్ కూడా పొందుతుంది. ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ. 8.23 లక్షలు (ఎక్స్ షోరూమ్).
హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)
భారతదేశంలో హ్యుందాయ్ అంటే అందరికీ గుర్తొచ్చే కారు వెన్యూ. దీన్ని బట్టి మార్కెట్లో ఈ కారుకు ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడగానే ఆకర్షించబడే డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోడల్ యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 9.36 లక్షలు (ఎక్స్ షోరూమ్).
హ్యుందాయ్ వెన్యూ పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా పొందుతుంది. ఈ వేరియంట్ ధరలు రూ. 10 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అనేది నేడు ఎక్కువమంది కోరుకునే ఫీచర్. కాబట్టి కంపెనీ ఈ ఫీచర్ కూడా వెన్యూ కారులో అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ వెన్యూ లైనప్ ఎస్ ప్లస్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.
టాటా పంచ్ (Tata Punch)
పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు టాటా మోటార్స్ యొక్క పంచ్, ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలను పొందుతోంది. ప్రస్తుతం మార్కెట్లో టాటా పంచ్ ఫ్యూయెల్ మోడల్ మాత్రమే కాకుండా CNG మరియు ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా అత్యద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇవి వాహన వినియోగదారుల యొక్క భద్రతకు పెద్దపీట వేస్తాయి.
దేశీయ మార్కెట్లో టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 6.12 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా పొందుతుంది. ఈ వేరియంట్ ధర రూ. 8.34 లక్షలు 9ఎక్స్ షోరూమ్). ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మరియు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని పొందాలనుకునే కస్టమర్లకు టాటా పంచ్ మంచి ఎంపిక అవుతుంది. ఇది 5 స్టార్ రేటింగ్ కటింగ్ ఉత్తమ కారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)
గత కొన్ని రోజులకు ముందు మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ కారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా పొందుతుంది. ప్రస్తుతం మార్కెట్లో చాలామంది వాహన తయారీదారులు తమ కార్లలో సన్‌రూఫ్ ఫీచర్ అందిస్తున్నాయి. దీంతో అతి తక్కువ కాలంలోనే ఈ కారు ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.
Don’t Miss: కార్ల వినియోగంలో కూడా మెగాస్టారే.. చిరంజీవి గ్యారేజిలోని కార్లు చూశారా?
కియా సోనెట్ (Kia Sonet)
సౌత్ కొరియా బ్రాండ్ అయినప్పటికీ.. కియా మోటార్స్ దేశీయ విఫణిలో అడుగుపెట్టినప్పటి నుంచి, ఇప్పటి వరకు ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచుకోవడంలో సక్సెస్ సాధించింది. కియా మోటార్ యొక్క సోనెట్ కారు రూ. 8.19 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే సరసమైన మరియు అత్యుత్తమ కారు. ఇటీవలే కంపెనీ సోనెట్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ పరిచయం చేసింది.