ఢిల్లీ వేదికపై కనిపించిన కొత్త Toyota కార్లు – పూర్తి వివరాలు

Toyota New Cars At Bharat Mobility Global Expo 2024: న్యూఢిల్లీలో జరుగుతున్న ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024’ (Bharat Mobility Global Expo 2024) లో ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా (Toyota) ఐదు మోడళ్లను ప్రదర్శించింది. టయోటా ఇండియా ప్రస్తుతం పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, CNG మరియు డీజిల్ కార్లను విక్రయిస్తోంది. ఈ కథనంలో గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ఆవిష్కరించిన లేటెస్ట్ ఉత్పత్తులను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

టయోటా మిరాయ్ (Toyota Mirai)

భారత్ మొబిలిటీ షో 2024లో టయోటా యొక్క మిరాయ్ అందరి దృష్టిని ఆకర్శించింది. కంపెనీ యొక్క ఈ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ హైడ్రోజన్‌తో నడుస్తుంది. ఇది ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అమ్మకానికి ఉంది. ప్రస్తుతానికి భారతదేశంలో ఈ సెడాన్ అధికారికంగా లాంచ్ అవ్వలేదు. కానీ గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి ఉండటం వల్ల భారతదేశానికి కూడా దిగుమతి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కారుని ఢిల్లీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు.

ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (Innova Hycross Flex Fuel)

ఢిల్లీ గ్లోబల్ ఎక్స్‌పో వేదికపై మేడ్ ఇన్ ఇండియా ఇన్నోవా హైక్రాస్ కూడా ప్రదర్శించారు. అయితే ఈవెంట్‌లో కనిపించిన ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ పవర్‌ట్రెయిన్‌ను పొందుతుంది. ఇది స్టాండర్డ్ ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ మాదిరిగానే అదే 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఇది ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌తో కూడా స్టాండర్డ్ మోడల్ వలె అదే స్థాయిలో పని చేయగలదు. ఈ కారు పెట్రోల్ మోడల్ కంటే కూడా తక్కువ హైడ్రోకార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది.

ఇక్కడ కనిపించే కారు బిఎస్6 ఫేజ్ II కంప్లైంట్ అని, ఇది 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్‌తో నడుస్తుందని టయోటా చెబుతోంది. కాబట్టి ఇందులో నుంచే వెలువడే ఉద్గారాలు తక్కువగా ఉంటాయి. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ కావడం వల్ల ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ 60 శాతం ఈవీ మోడ్‌లో పనిచేస్తుంది, మిగిలిన 40 శాతం ఇథనాల్ శక్తితో పనిచేసే ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఇందులో 2.0 లీటర్, స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ వివిధ స్పార్క్ ప్లగ్‌లు, పిస్టన్ రింగ్ టాప్‌లు, అలాగే వాల్వ్ మరియు వాల్వ్ సీట్‌లను పొందుతుంది. ఇవన్నీ వాటర్ రెసిస్టెంట్ (నీటి నిరోధకత) కలిగి ఉండటం వల్ల కలిగి ఉంటుంది. ఇథనాల్‌పై నడుస్తున్నప్పుడు తుప్పు పట్టకుండా చేస్తుంది.

ఇథనాల్‌ సెన్సార్ ఇన్‌స్టాల్

టయోటా కంపెనీ తన ఉత్పత్తులలో హైడ్రోకార్బన్ ఉద్గారాలను మరింత తగ్గించడానికి ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో త్రీ వే క్యాటలిస్ట్ వంటి వాటిని చేర్చింది. అంతే కాకుండా ఇథనాల్‌తో సరైన పనితీరుకు సంబంధించి చేసిన అనేక మార్పుల్లో వాహనం యొక్క ఫ్యూయల్ ఫిల్టర్, ఫ్యూయల్ పంప్, అలాగే ఫ్యూయల్ లైన్‌లకు కూడా చేయబడ్డాయి, ఇప్పుడు ఇథనాల్ సెన్సార్ ఇన్‌స్టాల్ కూడా చేయబడింది.

Don’t Miss: ఒక్క చూపుతోనే ఫిదా చేస్తున్న బాలీవుడ్ సింగర్ కొత్త కారు – ఫోటోలు వైరల్

టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ మోడల్ మాత్రమే కాకుండా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రత్యేకంగా రూపొందించిన టయోటా హైలక్స్ ఎమర్జెన్సీ ట్రక్, హైరైడర్ CNG కూడా కనిపించాయి. ఇవన్నీ కూడా చాలా ఆకర్షయనీయంగా ఉన్నాయి. భారతీయ మార్కెట్లో టయోటా యొక్క మొదటి ఈవీ వచ్చే ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది.

భారతీయ మార్కెట్లో టయోటా కంపెనీ తన ఉనికిని నిరంతరం చాటుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను కొత్త టెక్నాలజీలను ఉపయోగించి మార్కెట్లో లాంచ్ చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని లేటెస్ట్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ కొత్త ఉత్పత్తులు మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.